Home /News /telangana /

RADISSON BLU HOTEL AND FOODING MINK PUB LICENSE HAS BEEN CANCELLED HOURS AFTER DRUGS PARTY BUSTED MKS

KCR సర్కార్ సంచలనం: సెలబ్రిటీల డ్రగ్స్ పార్టీ కేసులో అనూహ్య ట్విస్ట్.. ఆ రెండిటికి భారీ షాక్

డ్రగ్స్ పార్టీ కేసులో నిహారిక, రాహుల్

డ్రగ్స్ పార్టీ కేసులో నిహారిక, రాహుల్

మెగా డాటర్ నిహారిక, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితర సెలబ్రిటీల పేర్లు జాబితాలో ఉన్న డ్రగ్స్ పార్టీ కేసులో కేసీఆర్ సర్కారు చర్యలకు దిగింది. హైదరాబాద్ లో కలకలం సృష్టించిన ఈ ఉదంతంపై సంచలన నిర్ణయాలు తీసుకుంది.

విశ్వనగరం హైదరాబాద్ లో పెను కలకలం సృష్టించిన డ్రగ్స్ పార్టీ ఉదంతంపై కేసీఆర్ సర్కారు సంచలన నిర్ణయాలు తీసుకుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రాజకీయ నేతలు నందీశ్వర్ గౌడ్, అంజన్ కుమార్ గౌడ్ కొడుకులు, మాజీ డీజీపీ కూతురు, పలువురు ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ, సినీ ప్రముఖుల పిల్లల పేర్లు నమోదైన ఈ కేసు సర్కారు వారి తాజా నిర్ణయంతో అనూహ్య మలుపు తిరిగినట్లయింది. హైదరాబాద్ లో డ్రగ్స్ దందా వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందనే విపక్షాల ఆరోపణల క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం ఘటన జరిగిన 24 గంటల్లోనే ఆ రెండు సంస్థలకు భారీ షాకిచ్చింది..

డ్ర‌గ్స్ పార్టీ నిర్వహిస్తూ అడ్డంగా దొరికిపోయిన ప్రఖ్యాత రాడిస‌న్ హోట‌ల్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాకిచ్చింది. అలాగే, రాడిసన్ హోటల్ పరిధిలో అసలు కథకు మూల కేంద్రమైన ఫుడిండ్ అండ్ మింక్ పబ్బుకు కూడా శరాఘాతం తగిలింది. ఆ రెండు సంస్థల లైసెన్సులను తెలంగాణ ఎక్సైజ్ శాఖ ర‌ద్దు చేసింది. పబ్‌, లిక్కర్‌ లైసెన్స్‌లు రద్దు చేస్తూ ఎక్సైజ్‌ శాఖ సోమవారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాడిసన్ హోటల్ అంతర్జాతీయంగా పేరున్న ఫ్రాంచైజ్ కావడంతో వ్యాపార వర్గాల్లోనూ ఈ ఉదంతం చర్చనీయాంశమైంది.

Radisson Blu: డ్రగ్స్ ఎలా ఉంటాయో తెలీదు.. పోలీసుల తీరు కరెక్టేనా?: రాహుల్ సిప్లీగంజ్ సంచలనం


నిజానికి 24 గంటలపాటు లిక్కర్ సర‌ఫ‌రాకు జ‌న‌వ‌రి 7వ తేదీన‌ రాడిస‌న్ హోట‌ల్ అనుమతి తీసుకున్నది. ఆమేరకు ప్రభుత్వానికి రూ. 56 ల‌క్ష‌ల బార్ ట్యాక్స్ చెల్లించి రాడిస‌న్ హోట‌ల్ లైసెన్స్ పొందింది. 2బీ బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో ఈ అనుమ‌తి తీసుకున్న‌ది. కానీ అక్కడ డ్రగ్స్ కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.

Radisson Blu: కేటీఆర్ అండతో డ్రగ్స్ దందా.. రంగంలోకి కేంద్రం?.. మహేశ్ షాకింగ్ కామెంట్స్


ఫుడ్డింగ్ అండ్ మింక్ ప‌బ్ లో డ్రగ్స్ పార్టీ కేసులో బంజారాహిల్స్ పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. అభిషేక్ ఉప్ప‌ల‌, అనిల్ కుమార్, అర్జున్ వీర‌మాచినేని, కిర‌ణ్ రాజ్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. వీరిలో అభిషేక్ ఉప్ప‌ల‌, అనిల్ కుమార్‌ను పోలీసులు అరెస్టు చేయ‌గా, మిగ‌తా ఇద్ద‌రు ప‌రారీలో ఉన్నారు. ఫుడ్డింగ్ అండ్ మింక్ డ్ర‌గ్స్ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నాంప‌ల్లి కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. డ్ర‌గ్స్ కేసు నిందితుల‌ను ఏడు రోజుల పాటు క‌స్ట‌డీకి కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Radisson Blu: హైదరాబాద్‌లో సంచలనం.. డ్రగ్స్ పార్టీలో సెలబ్రిటీలు.. పోలీసులపై వేటు.. ఎన్‌కౌంటర్ చేస్తారా?


ఫుడ్డింగ్ అండ్ మింక్ ప‌బ్‌ను 2017లో కిర‌ణ్ రాజ్, అత‌ని భార్య లీజుకు తీసుకున్నారు. 2020 వ‌ర‌కు భార్య‌తో క‌లిసి కిర‌ణ్ ప‌బ్‌ను న‌డిపారు. 2020, ఆగ‌స్టులో అభిషేక్ ఉప్ప‌ల‌, అనిల్‌కుమార్‌కు కిర‌ణ్ లీజుకు ఇచ్చాడు. 2022, జ‌న‌వ‌రి నుంచి ప‌బ్‌ని అభిషేక్ ఉప్ప‌ల‌, అత‌ని గ్యాంగ్ ఆప‌రేట్ చేస్తున్నారు. ప‌బ్‌ను అభిషేక్‌కు లీజుకు ఇచ్చిన‌ప్ప‌టికీ కిర‌ణ్ పార్ట్‌న‌ర్‌గా కొన‌సాగారు. కిర‌ణ్ రాజు, అర్జున్ వీర‌మాచినేని కోసం రెండు ప్ర‌త్యేక బృందాలు గాలిస్తున్నాయి. నిందితుడు అభిషేక్ సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. అత‌ని ఫోన్‌లో కీల‌క స‌మాచారం ఉంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

Zodiac Signs: కిటికీ లేని గదిలో ఏ రాశివారు ఏం చేస్తారో తెలుసా? మీ రియాక్షన్ చెక్ చేసుకోండి


ఫుడ్డింగ్ అండ్ మింక్ ప‌బ్ నిబంధ‌న‌లను అతిక్ర‌మించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలిన‌ట్లు స‌మాచారం. ఎంట్రీలో ఆధార్ వివ‌రాలు తీసుకోకుండానే మైన‌ర్ల‌ను ప‌బ్‌లోకి అనుమ‌తించారు. మైన‌ర్ల‌కు లిక్క‌ర్ కూడా ఇచ్చారు. ప‌బ్‌లో డ్ర‌గ్స్ వాడ‌కానికి అస‌లు కార‌ణం బ‌ర్త్ డే పార్టీ అని తెలుస్తోంది. ఓ బడా బాబు బ‌ర్త్‌డే పార్టీ శ‌నివారం ప‌బ్‌లో జ‌ర‌గ్గా, ఈ వేడుక‌కు డ్ర‌గ్స్ తీసుకొచ్చిన‌ట్లు స‌మాచారం. బ‌ర్త్ డే పార్టీ చేసిన బ‌డా బాబు విజ్ఞ‌ప్తి మేర‌కు డ్ర‌గ్స్ తీసుకొచ్చారనే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆ కోణంలోనే పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Drugs case, Hyderabad, Hyderabad police, Telangana, Telangana Government

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు