నెరవేరిన కల.. ఒక్కరోజు కమిషనర్‌గా 17 ఏళ్ల యువతి...

ఒక్క రోజు పోలీస్ కమిషనర్ కావాలని ఆమె కోరుకుంది. ఈ విషయాన్ని మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ దృష్టికి తీసుకొచ్చారు.

news18-telugu
Updated: October 29, 2019, 10:54 PM IST
నెరవేరిన కల.. ఒక్కరోజు కమిషనర్‌గా 17 ఏళ్ల యువతి...
రాచకొండ పోలీస్ కమిషనర్‌తో రమ్య
  • Share this:
క్యాన్సర్‌తో బాధపడుతున్న 17 ఏళ్ల బాలిక కోరికను నెరవేర్చారు రాచకొండ పోలీసులు. ఓల్డ్ అల్వాల్‌కు చెందిన రమ్య ఇంటర్ రెండోసంవత్సరం చదువుతోంది. ఆమెను బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతోంది. హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అయితే, ఒక్క రోజు పోలీస్ కమిషనర్ కావాలని ఆమె కోరుకుంది. ఆమె కోరికను మేక్ ఏ విష్ ఫౌండేషన్ ప్రతినిధులు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆమె కోరిక నెరవేర్చేందుకు ఆయన ముందుకొచ్చారు. ఈ రోజు బాలిక ఫుల్ యూనిఫాంలో కమిషనర్ కార్యాలయంలో బాధ్యతలు తీసుకుంటున్నారు. పోలీసులకు శాంతిభద్రతలపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు 5 S లతో కూడిన సలహా ఇచ్చారు. రమ్య త్వరగా కోలుకోవాలని పోలీసులు ఆకాంక్షించారు. గతంలో ఆరేళ్ల క్యాన్సర్ బాధితుడికి కూడా ఇలాగే ఒక్కరోజు పోలీస్ కమిషనర్‌గా అవకాశం కల్పించి.. అతడి కోరికను నెరవేర్చారు.First published: October 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...