హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : గ్రేట్ పోలీస్.. రైలుకు అడ్డంగా వెళ్లి దోంగల పట్టివేత... ఫ్లైట్‌లో చేజింగ్...!

Hyderabad : గ్రేట్ పోలీస్.. రైలుకు అడ్డంగా వెళ్లి దోంగల పట్టివేత... ఫ్లైట్‌లో చేజింగ్...!

Hyderabad : రాచకోండ పోలీసులు మరో విక్టరీని సొంతం చేసుకున్నారు. చోరి జరిగిన ఇరవైనాలుగు గంటల్లో దోంగలను పట్టుకున్నారు. అదికూడా రైలులో వెళుతున్నవారిని చేజ్‌ చేసి పట్టుకున్నారు. రైలుకంటే ముందే చేరుకునేందుకు విమానంలో వెళ్లి రైలుకు అడ్డంగా నిలబడ్డారు.

ఇంకా చదవండి ...

  రాష్ట్ర పోలీసులు క్రైంను కట్టడి చేయడంలో ఎప్పుడు ముందుంటారు. ఎంత క్లిష్టమైన నేరాలను కూడా చాకచక్యంగా వ్యవహరించి నిందితులను సకాలంలో పట్టుకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి... అదికూడా నేరాలు జరిగిన ఇరవైనాలుగు గంటల్లో మిస్టరీని చేధిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా జరిగిన దోంగతనంలో కూడా ఇదే చాకచక్యాన్ని ప్రదర్శించారు.

  వివరాల్లోకి వెళితే...జూన్‌ 30న నగరంలోని ఎల్బీ నగర్‌లోని ఓ సెల్‌షాపులో దోంగతనం జరిగింది. దోంగలు సుమారు మూడు లక్షల రూపాయల విలువ చేసే 26 ఫోన్లను తీసుకుని  పరారయ్యారు. అయితే యాజమాని దొంగతనం జరిగిన మరునాడే స్థానిక  ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన ఎల్బీనగర్ సీసీఎస్ విభాగానికి చెందిన పోలీసులు, ఐటిసెల్ సిబ్బంది కలిసి ఆపరేషన్ చేపట్టారు. స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజిని సేకరించి పరిశీలించారు. అనంతరం సమీపంలోని కూలిపని చేస్తూ నివసిస్తున్న వారని అనుమానించారు. వెంటనే స్థానిక గుడిసెల్లోకి వెళ్లి వారి గురించి ఆరా తీశారు.

  దీంతో పోలీసుల అనుమానం నిజమైంది. దొంగలను గుర్తుపట్టిన గుడిసెవాసులు వివరాలు చెప్పారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన మహ్మద్ ముస్లింషేక్, మహ్మద్ జసిముద్దిన్, రఫీల్ ఉల్‌షేక్ గా గుర్తించారు. వారు రెండు నెలల క్రితమే నగరానికి చేరుకుని బైరమాల్‌గూడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు చేస్తున్నారు. ఇక స్థానికంగా అక్కడే గుడిసెలో ఉంటున్నట్టు తెలిపారు. కాగా నిత్యం మద్యం సేవించేవారని స్థానిక గుడిసెవాసులు వివరించారు.

  అయితే పోలీసులు విచారణ చేయడాకంటే ముందుగానే దోంగలు సర్థుకున్నారు. సెల్‌ఫోన్‌లు తీసుకుని రైలులో పశ్చిమబెంగాల్‌ వెళుతున్నట్టు స్థానికులు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆలస్యం చేయకుండా వారిని పట్టుకునేందుకు స్కెచ్ వేశారు. విమానంలో ఖారగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. స్థానిక పోలీసుల సహాకారం తీసుకుని అలర్ట్ అయ్యారు. ఇక దోంగలు ఖారగ్‌పూర్ స్టేషన్ చేరుకున్న వెంటనే ఫ్లాట్ ఫాంపై ఉన్న ఓ దొంగను పట్టుకున్నారు. అయితే ఇది గమనించిన మిగతా వారు పారిపోయోందుకు ప్రయత్నించారు. పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కు తీసుకువచ్చి కోర్టు ముందు హజరుపరిచారు. కాగా ఈ ఆపరేషన్‌లో పాల్గోన్న పోలీసులు రాచకొండ సీపీ అభినందించారు.

  First published:

  Tags: Crime story, Rachakonda Police

  ఉత్తమ కథలు