Nalgonda : నర్సు నిర్లక్ష్యం.. కరోనా టీకాకు బదులుగా రేబిస్ ఇంజక్షన్...!

Nalgonda : నర్సు నిర్లక్ష్యం.. కరోనా టీకాకు బదులుగా రేబిస్ ఇంజక్షన్...,!

Nalgonda : టీకా వేయమని ఆసుపత్రికి వెళితే... కుక్కకాటు ఇంజక్షన్ ఇచ్చారు.. అది కూడా ఒకే సిరంజీతో ఇద్దరికి చేయడం కలకలం రేపుతోంది...కుక్క కాటుకు సంబంబంధించిన రేబిస్ ఇంజక్షన్ వేయడంతో ఆ మహిళ ఆందోళణకు గురైంది.

  • Share this:
    కరోనా టీకాలు వేయడంలో అక్కడక్కడ నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు..దీంతో టీకా కోసం వచ్చే వారికి తిప్పలు తప్పడం లేదు..ముఖ్యంగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో కొన్ని నర్సుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తీసుకువస్తుంది. కరోనా టీకా నేపథ్యంలోనే నర్సుల నిర్లక్ష్య సంఘటనలు ఎక్కువగా బటయకు వస్తున్నాయి. సరైన అడ్మినిస్ట్రేషన్ లేక నర్సులు వారి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు..ఇలా మొన్నటికి మొన్న ఒకేసారి మూడు డోసుల కోవిడ్ టీకాను ఇచ్చి సంచలనం రేపారు. ఇప్పుడు తాజాగా చదువు రాని మహిళకు తనకు సంబంధించిన వ్యాక్సిన్ లెటర్ తీసుకుని వెళ్లినా... నిర్లక్ష్యాన్ని వీడలేదు.. దీంతో దేశంలోనే అక్కడక్కడ ఇలాంటీ సంఘటనలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

    ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని నల్లగొండ జిల్లా కట్టంగూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఈ సంఘటన వెలుగు చూసింది.వివరాల్లోకి వెళితే..కట్టంగూర్ మండలం బొల్లెపల్లి ప్రాధమిక పాఠశాలలో ప్రమీళ స్కావెంజర్‌గా పని చేస్తుంది. అయితే మంగళవారం కొవిడ్ టీకా వేసుకునేందుకు హెడ్మాస్టర్ సహాయం కోరింది..తనకు టీకా వేయించాల్సిందిగా ఆయన చేత ఓ లెటర్ తీసుకుని స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. ఆమెకు చదువు రాకపోవడంతో అక్కడే ఉన్న రెండు క్యూలైన్లలో ఒకదానిలో నిలబడింది..అయితే అది కరోనా టీకా లైన్‌ కాకుండా కుక్కకాటు ఇంజక్షన్ వేసే ఇచ్చే లైనులో నిలబడింది.

    అయినా.. నర్సు వద్దకు వెళ్లి హెడ్మాస్టర్ ఇచ్చిన లెటర్‌ను ఇచ్చింది. అయితే ఆ నర్సు లెటర్‌ చూడకుండానే పక్కన పెట్టింది. అందరికి ఇచ్చినట్టుగానే ఆమెకు కుక్కకాటు సంబంధించిన రేబిస్ ఇంజక్షన్ ఇచ్చింది.అదికూడా ఒకే సిరంజీతో ఇద్దరికి ఇంజక్షన్ చేసినట్టు ప్రమీళ గుర్తించింది..అప్పుడు ప్రమీళ తేరుకుని ఒకే సిరంజీతో ఇద్దరికి ఎలా ఇంజక్షన్ చేస్తావని నిలదీయడంతో సదరు నర్సు నిమ్మదిగా అక్కడి నుండి జారుకుంది. అప్పుడు అసలు విషయం వెలుగులోకి వచ్చింది..తాను తీసుకువచ్చిన లెటర్‌ను పక్కవాళ్లు చదివి అప్పుడు విషయాన్ని చెప్పారు. తాను కరోనా టీకా కోసం వస్తే..రేబిస్ ఇంజక్షన్ ఇచ్చారని తెలుసుకుంది.. సిరంజీ మార్పు కాదు ఏకంగా టీకానే మార్చివేసిందని. ప్రమీళ ఆందోళనకు గురైంది.

    అయితే వైద్యులు మాత్రం ఆమె రేబిస్ ఇంజక్షన్ క్యూ‌లో నిలబడడం వల్ల ఈ పొరపాటు జరిగిందని, ఒకే సిరంజీతో ఇద్దరికి ఇంజక్షన్ చేయలేదని స్థానిక ఇంచార్జీ డా. కల్పన వివరణ ఇచ్చారు..ఆమెకు మాములు టీకా మాత్రమే ఇచ్చామని, కుక్కకాటు ఇంజక్షన్ వేయలేదని చెప్పారు. అయితే దాని వల్ల ఎలాంటీ ప్రమాదం లేదని సర్ధిచెప్పారు. ఏది ఏమైనా ఆసుపత్రికి వెళుతున్న రోగులను సిబ్బంది ఎలా చూస్తారనే దానికి ఈ సంఘటన నిదర్శనం..కాగా కరోనా టీకాల నేపథ్యంలోనే పలు చోట్ల ఇలాంటీ నిర్లక్ష చర్యలు బయట పడుతున్నాయి.. ఇలా నర్సుల నిర్లక్ష్యంతో ఒకేసారి మూడు డోసులు వేయడం..వేర్వేరు కోవిడ్ వ్యాక్సిన్‌లు చేయడం లాంటీ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
    Published by:yveerash yveerash
    First published: