హోమ్ /వార్తలు /తెలంగాణ /

Meditation teacher died: ప్రపంచ​ ధ్యాన గురువు కన్నుమూత.. షాక్​లో ఆధ్యాత్మిక వేత్తలు

Meditation teacher died: ప్రపంచ​ ధ్యాన గురువు కన్నుమూత.. షాక్​లో ఆధ్యాత్మిక వేత్తలు

సుభాష్‌ పత్రిజీ (ఫైల్​)

సుభాష్‌ పత్రిజీ (ఫైల్​)

ధ్యానులు, పిరమిడ్‌ మాస్టర్లు, సాధకులు, ఆధ్యాత్మికవేత్తలకు బ్యాడ్​న్యూస్​. నిజామాబాద్​ వాసి ప్రపంచ ధ్యానగురువు సుభాష్‌ పత్రిజీ కన్నూమూశారు.

  పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ (74) ఆదివారం కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన బెంగళూరులో చికిత్స తీసుకుంటున్నారు. రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను కడ్తాల్‌లోని మహేశ్వర మహా పిరమిడ్‌కు ధ్యాన కేంద్రానికి తరలించారు. ఆదివారం సాయంత్రం పత్రిజీ మరణించారు. ఈ క్రమంలో పత్రీజీ కన్నుమూసినట్లు పిరమిడ్ వర్గాలు ఆదివారం అధికారికంగా ప్రకటన చేశాయి.  కాగా, సుభాష్​ గారి మరణ వార్త విషయం తెలుసుకున్న ధ్యానులు, పిరమిడ్‌ మాస్టర్లు, సాధకులు, ఆధ్యాత్మికవేత్తలు ఆయనను చూడడానికి పెద్దసంఖ్యలో మహేశ్వర మహాపిరమిడ్‌కు తరలివస్తున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు సుభాష్ పత్రీజీ అంత్యక్రియలు నిర్వహిస్తామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు.

  సుభాష్ పత్రిజీ తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ బోధన్‌లో జన్మించారు. కర్నూలు జిల్లాలో కోరమండల్‌ ఫెర్టిలైజర్స్‌ సంస్థలో ఉద్యోగం చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్‌ మండలం అన్మాసుపల్లి శివారులో ప్రపంచంలోనే అతిపెద్ద కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్‌ను 2012లో నిర్మించారు. పిరమిడ్‌ స్పిరిచ్యువల్‌ సొసైటీ మూమెంట్‌ ఆఫ్‌ ఇండియాను పత్రిజీ స్థాపించారు.

  కాగా, సుభాష్​ గారి మరణం పట్ల బీజేపీ నేత విష్ణువర్ధన్​ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విటర్​లో.. ‘‘ పిరమిడ్‌ ధ్యాన గురువు సుభాష్‌ పత్రిజీ మరణం బాధాకరం . పిరమిడ్ కేంద్రం ద్వారా అనేక రకాల ధ్యానం ప్రచారంలో విశేషంగా చేసిన  సేవలు గుర్తించదగినవి . వారి మరణం పట్ల నా సంతాపం , వారి భక్తులకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను ’”అని తెలిపారు.

  కాగా, సుభాష్​ పత్రీజీ గారికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి చాలామంది వచ్చే అవకాశం ఉండటంతో పిరమిడ్​ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Nizamabad, Yoga

  ఉత్తమ కథలు