సింధుకు పద్మభూషణ్.. మరో నలుగురు తెలుగు వారికి పద్మ అవార్డులు

తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధుకు భారత దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్‌ వరించింది. తెలంగాణ కోటాలో క్రీడల విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది.

Updated: January 25, 2020, 9:38 PM IST
సింధుకు పద్మభూషణ్.. మరో నలుగురు తెలుగు వారికి పద్మ అవార్డులు
తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధుకు భారత దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్‌ వరించింది. తెలంగాణ కోటాలో క్రీడల విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది.
  • Share this:
71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యున్నత ‘పద్మ’ పురస్కారాలను కేంద్రప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈసారి మొత్తం ఐదుగురి తెలుగువారికి పద్మ అవార్డులు వచ్చాయి. తెలుగు తేజం, బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధుకు భారత దేశ మూడో అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్‌ వరించింది. తెలంగాణ కోటాలో క్రీడల విభాగంలో ఆమెకు ఈ అవార్డు దక్కింది. పివి సింధు ఇప్పటికే పద్మ శ్రీ, రాజీవ్ ఖేల్ రత్న అవార్డులను అందుకున్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ నుంచి చింతల వెంకటరెడ్డి (వ్యవసాయం), విజయసారధి శ్రీభాష్యం (సాహిత్యం, విద్య)కి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. ఏపీ నుంచి ఎడ్ల గోపాల్‌రావు, దలవాయి చలపతిరావుకు కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీరిద్దరికి కళలు విభాగంలో అవార్డులు దక్కాయి. ఈ ఏడాదికి మొత్తం 141 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేయగా.. ఇందులో ఏడుగురిని పద్మ విభూషణ్ వరించించింది. మరో 16 మందికి పద్మ భూషణ్, 118 మందికి పద్మ శ్రీ అవార్డు దక్కాయి.

First published: January 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు