Punjagutta death : పంజాగుట్టు (Punjagutta girl death )బాలిక హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి..హత్య అనంతరం రాజస్థాన్‌కు వెళ్లిన తల్లితో పాటు ఆమె ప్రియున్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువచ్చి మీడియా ముందు ప్రవేశపెట్టారు.
పంజాగుట్టలో( Punjagutta girl death )సంచలనం సృష్టించిన బాలిక మృతి కేసులో దారుణ సంఘటనలు వెలుగు చూశాయి. కన్నతల్లే బాలిక చేత బిక్షాటన చేయించడం తండ్రి జైలు పాలు కావడంతో మరొకరితో సహజీవనం పెట్టుకుని పిల్లల చేత బిక్షాటన చేయించడం లాంటీ అంశాలను పోలీసులు వెల్లడించారు. ముఖ్యంగా తల్లి మరోకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో తన తండ్రి దగ్గరకు తీసుకువెళ్లాలని తరచు ప్రశ్నించడంతో బాలిక ప్రియుడితో కలిసి చిత్రహింసలకు గురి చేశారు. దీంతో ఆ దెబ్బలకు తాళలేకనే బాలిక చనిపోయినట్టు పోలీసులు నిర్ధారించారు.
గత వారం రోజులుగా మిస్టరీగా మారిన పంజాగుట్ట ద్వారకనగర్ బాలిక మృతి కేసును పోలీసులు చేదించారు. ( Punjagutta girl death) మీయాపూర్కు చెందిన హీనా బేగం ఆమె భర్త గత కొన్ని సంవత్సరాలుగా బిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కాగా వీరికి ఇద్దరు ఆడపిల్లలు ,ఒక మగపిల్లవాడు ఉన్నాడు. చనిపోయిన మెహక్ తోపాటు తన అన్న ఆఫన్ లు తల్లివద్ద ఉంటుండగా మూడేళ్ల కూతురు అమ్మమ్మ వద్ద ఉంటుంది. కాగా హీనా భేగం భర్త గత ఆరు నెలలుగా జైల్లో మగ్గుతున్నాడు.
ఈ క్రమంలోనే హీనాభేగంకు పాతబస్తి డబీర్‌పుర ప్రాంతానికి చెందిన ఖాదర్‌తో పరిచయం ఏర్పాడింది. అనంతరం పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తమ వృత్తిగా మార్చుకున్న బిక్షాటన కోసం హీనా పిల్లలను వాడుకోవాలని నిర్ణయించారు. దీంతో మెహక్తోపాటు ఆఫన్లు తీసుకుని బెంగళూరు, ముంబై, పూణే జైపూర్ ప్రాంతాల్లో బిక్షాటన చేయిస్తూ జీవనం వెళ్లదీస్తున్నారు.
ఈ సమయంలో మెహక్ తనకు బిక్షాటన చేయడం ఇష్టం లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న స్టెప్ ఫాదర్ కూడా తనకు నచ్చడం లేదని చెప్పుతుండేది. దీంతో తన తండ్రివద్దకు తీసుకువెళ్లాలని ఆమె బెట్టు చేయడంతో పాటు తల్లిమాటను వినకపోవడంతో ఆమెను బెదిరింపులకు గురిచేయడంతో చిత్రహింసలకు గురి చేశారు. ఇలా మానసికంగా,శారీరకంగా హింసకు గురి చేయడంతో పాప సృహతప్పి పడిపోయింది. దీంతో ఆమెను వదిలించుకునేందుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నారు. ఇలా స్పృహ కోల్పోయిన పాపతోనే బెంగళూరు నుండి హైదరాబాద్ ఓ ప్రైవేటు బస్సులో బయలు దేరారు. దీంతో అర్థరాత్రి నగరానికి చేరుకునే సరికే పాప మృతి చెందింది. దీంతో ఎవరు లేరని భావించి పంజాగుట్ట ద్వారకపూరి కాలనీలో వదిలేసి తిరిగి రాజస్థాన్‌కు వెళ్లారు. అక్కడ బిక్షాటన చేసి అనంతరం రాజస్థాన్‌కు అటు బెంగళూరుకు చేరుకున్నారు. కాగా అక్కడి నుండి తిరిగి హైదరాబాద్‌కు రావడంతోనే వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.