PUBLIC REPRESENTATIVES ALERT ON CORONA THIRD WAVE VRY ADB
Adilabad : ఉరుకులు పరుగులు పెడుతున్న ఎమ్మెల్యే.. కరోనా ఉదృతంతో జనాల్లోకి ...
jogu ramanna
Adilabad : కరోనా ఉదృతమవుతున్న వేళ ప్రజాప్రతినిధులు రోడ్లపై ఉరుగులు పరుగులు పెడుతున్నారు.. దీంతో రోడ్డు మీదకు వచ్చి ప్రజల యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు.. వారికి అవసరమైన మందులు , అవసరాలు తీరుస్తున్నారు.
నిత్యం క్షేత్ర సందర్శనలు.. సమీక్షలు.. సమావేశాలు… వచ్చి పోయే సందర్శకులతో ముచ్చటిస్తూ వారి కష్ట సుఖాలు…సమస్యలు… ఆరా తీయడం… సందర్శకుల నుండి వినతలను స్వీకరించడం వంటి పనులతో నిత్యం బిజి బిజిగా గడిపే ఆదిలాబాద్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి జోగు రామన్న ఈ రోజు ఆదిలాబాద్ పట్టణ వీధుల్లోకి వచ్చారు. ఉదయం నుండే ఆదిలాబాద్ పట్టణంలో అంతటా కలియ తిరిగారు. ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రధానంగా పట్టణంపై దృష్టి సారించారు. పలువురు మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లను వెంటబెట్టుకొని ఎమ్మెల్యె జోగు రామన్న ఆదిలాబాద్ పట్టణంలో కాలినడకన విస్తృతంగా పర్యటించారు.
ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కరోనా పరిస్థితులపై చర్చించారు. తాజాగా రోజు రోజుకు ఉధృత రూపం దాల్చుతున్న కరోనా వైరస్ కట్టడికి తానే స్వయంగా రంగంలోకి దిగారు. కాలినడకన పట్టణంలో కలియ తిరిగుతూ ప్రజలకు కరోనా నిబంధనలు, జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. జన సంచారం అధికంగా ఉండే పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో, రైతు బజార్, నేతాజీ చౌక్, శివాజీ చౌక్ లతో పాటు పలు దుకాణాల్లో తిరుగుతూ ప్రజలకు కరోనా పట్ల అవగాహన కల్పించారు. రైతు బజార్ లో కూరగాయల విక్రయదారులను కలుస్తూ అవగాహన కల్పించారు. తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు వికయిస్తున్న వారితోను మాట్లాడి వారికి నిబంధనలను వివరించారు.
అటు ఆటోలు ఇతర వాహనాలపై వెళుతున్న మహిళలు, విద్యార్థులను పలకరిస్తూ మాస్క్, శానిటైజర్ల వినియోగం, ఆవశ్యకత గురించి తెలియజేశారు. అలాగే పట్టణంలో సుమారు ఐదు వేల వరకు మాస్కు లను పంపిణీ చేశారు. తాము రక్షణ చర్యలు పాటిస్తూ తమ వద్దకు వస్తున్న జనాలను కూడా కరోనా వైరస్ పట్ల అప్రమత్తం చేయాలని ప్రజానికాన్ని కోరారు. ఖచ్చితంగా సామాజిక దూరం పాటింస్తూ శానిటైజర్ లు వాడాలని సూచించారు. గతంలో వైరస్ ఉధృతి పెరిగి ప్రజల ఆరోగ్య రీత్యా లాక్ డౌన్ విధించడం జరిగిందని, ఇపుడు అలాంటి పరిస్థితులు మళ్లీ పునరావృతం కాకుండా ప్రజలు సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ శైలజ, మున్సిపల్ వైస్ చైర్మన్ జహిర్ రంజాని, టిఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు అజయ్, పట్టణ కార్యదర్శి ఆశ్రఫ్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యె వెంట పర్యటించిన వారిలో ఉన్నారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.