• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • PUBG ADDICTION 19 YEAR OLD BOY LEG AND HAND PARALYZED ADMITTED IN HOSPITAL BA

PUBG | తిండి, నిద్ర మానేసి పబ్ జీ.. ‘మైండ్ బ్లాంక్’

PUBG | తిండి, నిద్ర మానేసి పబ్ జీ.. ‘మైండ్ బ్లాంక్’

చైనాతో సరిహద్దు విబేధాల తర్వాత, దేశ రక్షణ అంశంలో పబ్ జీ సహా పలు చైనీస్ కంపెనీలను భారత్ బ్యాన్ చేసింది. భారత్ బ్యాన్ చేసిన తర్వాత పబ్ జీ డౌన్ లోడ్స్ భారీగా పడిపోయాయి.

నెల రోజుల పాటు సరైన ఆహారం నిద్ర లేకపోవడంతో చివరికి మెదడు మీద కూడా ఒత్తిడి పడి పరిస్థితి విషమంగా మారినట్టు వైద్యులు గుర్తించారు.

  • Share this:
    నెల రోజుల పాటు సరైన తిండి, నిద్ర లేకుండా అదే పనిగా పబ్ జీ ఆడుతున్న యువకుడికి మైండ్ బ్లాంక్ అయింది. మెదడులోని నరాల్లో రక్తప్రసరణ నిలిచిపోయింది. కాలు, చేయి కదపలేని పరిస్థితికి చేరుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని వనపర్తి జిల్లాలో జరిగింది. వనపర్తి జిల్లాకు చెందిన కేశవర్థన్ అనే యువకుడు తన తల్లితో కలసి ఉంటున్నాడు. నెల రోజులుగా మొబైల్‌లో పబ్ జీ ఆడుతూనే ఉన్నాడు. అన్నం తినడానికి రమ్మని తల్లి పిలిచినా.. వద్దని చెప్పేవాడు. రాత్రి పూట కూడా దుప్పటి కప్పుకొని మరీ పబ్ జీ ఆడేవాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం కేశవర్థన్‌కు జ్వరం వచ్చింది. వాంతులు రావడంతో కంగారుపడిన తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లింది. నెల రోజుల పాటు సరైన ఆహారం నిద్ర లేకపోవడంతో చివరికి మెదడు మీద కూడా ఒత్తిడి పడి పరిస్థితి విషమంగా మారినట్టు వైద్యులు గుర్తించారు. కుడికాలు, కుడి చేయి కదపలేని స్ధితికి చేరడంతో కేశవర్థన్‌ను సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రికి తరలించారు. శరీరంలో సోడియం, పోటాషియం నిల్వలు తగ్గి మెదడుపై పెను ప్రభావం చూపిందని వైద్యులు తేల్చారు. వైద్య చికిత్స తర్వాత అతడిని ఇంటికి పంపారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పబ్ జీ కానీ, వీడియో గేమ్ కానీ ఆడవద్దని హెచ్చరించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు