PROVIDE LUNCH TO POOR PEOPLE INSTEAD OF FINE VS MBNR
court verdict : కోర్టు ధిక్కారణ.. ఆసక్తికర శిక్ష వేసిన కోర్టు.. డబ్బుకు బదులుగా..
తెలంగాణ హైకోర్టు(:ఫైల్ ఫొటో)
మహబూబ్ నగర్... ఓ ప్రభుత్వ ఉద్యోగికి విధించిన జరిమానకు బదులుగా రాష్ట్ర్ర హైకోర్టు మరో ఆసక్తికరమైన శిక్షను విధించింది. కోర్టు ధిక్కారణ క్రింద విధించిన శిక్షను డబ్బుల రూపంలో కాకుండా ఇతర మార్గాల్లో ప్రస్తుత కరోనా సమయంలో ఇతరులకు సహాయం చేయాలనే శిక్షకు ఆదేశించింది.
ఓ ప్రభుత్వ ఉద్యోగికి విధించిన జరిమానకు బదులుగా రాష్ట్ర్ర హైకోర్టు మరో ఆసక్తికరమైన శిక్షను విధించింది. కోర్టు ధిక్కారణ క్రింద విధించిన శిక్షను డబ్బుల రూపంలో కాకుండా ఇతర మార్గాల్లో ప్రస్తుత కరోనా సమయంలో ఇతరులకు సహాయం చేయాలనే శిక్షకు ఆదేశించింది.
ఓ కేసులో కోర్టు ధిక్కరణ ఎదుర్కొన్నందుకు గానూ మహబూబ్ నగర్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ యాసిన్ ఖురేషీకి న్యాయమూర్తి రూ.వెయ్యి జరిమానా విధించారు. అయితే, న్యాయమూర్తి ఆదేశాలపై డిప్యూటీ కమిషనర్ ఖురేషీ అప్పీలు చేసుకున్నారు. తన వేతనం నుంచి జరిమానా చెల్లిస్తే కెరీర్‌కు మచ్చ వస్తుందని కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో కోర్టు ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంది.
రూ.వెయ్యి జరిమానాకు బదులుగా మరో ఆసక్తికరమైన శిక్షను విధించింది. ఉద్యోగి ప్రస్తుత రంజాన్‌లో ఉపవాసం చేస్తున్న నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా తీర్పు వెలువరించింది. వెయ్యి రూపాయలు ప్రభుత్వానికి చెల్లించడానికి బదులుగా ప్రస్తుత రంజాన్ మాసంలో ఏదైనా మసీదు వద్ద ఉపవాస దీక్షలు ముగించిన ముస్లింలకు భోజనాలు అందించాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఇలా వారంరోజుల పాటు కనీసం 20 మందికి భోజనాలు అందించాలని కూడా ఆదేశిస్తూ కోర్టు ధిక్కరణ కేసును ముగించింది.