హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : ఎస్టీ రిజర్వేషన్ పెంపు ప్రకటన ఓవైపు మోదం మరోవైపు ఖేదం .. అంతా ఆయనే చేశారంట

Telangana : ఎస్టీ రిజర్వేషన్ పెంపు ప్రకటన ఓవైపు మోదం మరోవైపు ఖేదం .. అంతా ఆయనే చేశారంట

st reservation reactions

st reservation reactions

Telangana: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని ఆదివాసి, గిరిజన భవన్ లను ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్ చేసిన గిరిజన రిజర్వేషన్ పెంపు ప్రకటనపై ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనుల్లో భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Adilabad, India

  (K.Lenin,News18,Adilabad)

  తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్(Hyderabad)లోని ఆదివాసి, గిరిజన భవన్ లను ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్(KCR) చేసిన గిరిజన రిజర్వేషన్ పెంపు ప్రకటనపై ఆదిలాబాద్ (Adilabad)జిల్లాలోని ఆదివాసి గిరిజనుల్లో భిన్నవాదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ లంబాడాలు సంబురాలు జరుపుకుంటుంటే మరోపక్క ఆందోళనలు కూడా కొనసాగుతున్నాయి. జిల్లాలోని పలుచోట్ల ఎస్టీ(ST)లకు పది శాతం రిజర్వేషన్ల ప్రకటనపై ఆనందం వ్యక్తం చేస్తూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు.

  Hyderabad : స్విగ్గీలో స్వీట్ ఆర్డర్ చేస్తే .. తినేలోపే అమాయకుడి ప్రాణం పోయింది

  ఓవైపు సంబురాలు ..

  సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ ప్రకటనపై ఆదిలాబాద్ జిల్లాలో భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. తలమడుగు మండలంలోని  పూనగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  బోథ్ శాసనసభ్యుడు రాథోడ్ బాపురావు గిరిజనులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ ,  భూమిలేని నిరుపేదలకు గిరిజన బంధు పథకంతో పాటు పోడు భూములకు పట్టాలు కల్పిస్తానని  నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పేద ప్రజల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, అన్ని వర్గాల  అభివృద్దే అంతిమ లక్ష్యంగా పని చేస్తోందని అన్నారు ఎమ్మెల్యే.రిజర్వేషన్‌ల పెంపుదల కోసం గత కొన్నేళ్లుగా లంబాడా గిరిజనులు సాగించిన పోరాటం ఎట్టకేలకు ఫలించిందని లంబాడా హక్కుల పోరాట సమితి నేతలు పేర్కొంటున్నారు.

  మరోవైపు నిరసన ర్యాలీలు ..

  ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన రిజర్వేషన్‌ పెంపు ప్రకటనను తుడుం దెబ్బ నాయకులు ఖండిస్తున్నారు. దేశంలోని లంబాడాలను ఒకే చోట చేర్పించి వారికి రిజర్వేషన్లన్ పెంచి ఆదివాసుల పొట్టకొట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడుం దెబ్బ ఆధ్వర్యంలో మరోసారి ఉద్యమానికి నడుం బిగించారు. చలో జోడేఘాట్ నినాదంతో గిరిజన వీరుడు కొమురంభీం స్వస్థలమైన జోడేఘాట్ కు పాదయాత్రను కొనసాగిస్తున్నారు. చట్ట బద్దత లేని లంబాడాలనూ ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

  Rain alert: తెలంగాణకు భారీ వర్ష సూచన .. రెయిన్ ఎఫెక్ట్ ఎన్ని రోజులంటే ..?

  ప్రకటనతోనే భిన్నవాదనలు ..

  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై సవితి తల్లి ప్రేమను చూపుతున్నాయని, ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు గోడం గణేష్. రాజ్యాంగంలో పొందుపరచిన ఆదివాసీల చట్టాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కాయని విమర్శించారు. ఎస్టీ జాబితాలో లంబాడాలను చేర్చుకోవడం వల్ల ఆదివాసీ తెగలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.రిజర్వేషన్ పెంపు కోసం చేసిన తమ పోరాటం ఫలించిందని లంబాడాలు అంటుంటే ..రిజర్వేషన్‌ పెంచి విద్య , ఉద్యోగం, ఉపాధిలో తమకు అవకాశం లేకుండా చేస్తున్నారని తుడుం దెబ్బ ఆదివాసీలు మండిపడుతున్నారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించెంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తమని స్పష్టం చేశారు. 15కులాలను ఎస్టి జాబితలో చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Adilabad, CM KCR, Telangana News

  ఉత్తమ కథలు