Kamareddy : భర్త రివర్స్ గేమ్... భార్య ఇంట్లోనుండి వెళ్లిపోవాలని సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్..

భార్య ఇంట్లోనుండి వెళ్లిపోవాలని సెల్‌టవర్ ఎక్కి నిరసన

Kamareddy : సాధారణంగా తన భార్య రాలేదని , పిల్లలు సరిగా చూడడం లేదని నిరసన వ్యక్తం చేస్తారు..వారు వచ్చే వరకు నిరసన కొనసాగిస్తానని మొండికేస్తారు..కాని నిజామాబాద్‌లో ఓ వ్యక్తి మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరించాడు..

  • Share this:
మనుషుల సమస్యలు అనేకం ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా స్పందిస్తారో తెలియదు..సందర్భాన్ని బట్టి మనుషుల మానసిక స్థితి మారుతోంది..ఈనేపథ్యంలోనే సాధరణంగా భార్యభర్తల మధ్య లేదా తండ్రి కొడుకుల మధ్య ఘర్షణలు తలెత్తడం సాధరాణంగా జరుగుతుంటాయి..అయితే వీటిని మాములుగా తీసుకోని కొంతమంది వ్యక్తులు లేదా ఆయా కుటుంబసభ్యులు చాలా సీరియస్‌గా స్పందిస్తారు.. తమకు ఏదో జరిగిపోతుందనే మానసిక ఆందోళనకు దిగుతారు..ఇలాంటీ ఎలా వ్యవహరిస్తారో తెలియని స్థితిలోకి జారుకుంటారు..

ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా కేంద్రం కాళీకా దేవి ప్రాంతానికి చెందిన యాదగిరి తన భార్య బిడ్డలు వేధిస్తున్నారని తక్షణమే వాళ్లు తన ఇంట్లో నుండి వెళ్లిపోవాలంటూ అందోళన చేపట్టాడు. అదికూడ బట్టలు లేకుండా అర్థనగ్నంగా గ్రామంలోని సెల్‌టవర్ ఎక్కాడు.. అనంతంర భార్య విడాకులు తీసుకుని ఇంటి నుండి వెళ్లిపోయేవరకు సెల్ టవర్ దిగనని మొండికేస్తూ దానిపై విన్యాసాలు చేశాడు..తనను గత కొద్ది రోజులుగా కొడుకులు తనకు చితకబాదుతున్నారని నిరసన వ్యక్తం చేశాడు. ఇక ఎవరైనా టవర్ ఎక్కెందుకు ప్రయత్నిస్తే... క్రిందకు దూకుతానని హెచ్చిరించాడు..దీంతో ఎవరు పైకి ఎక్కేందుకు సహాసించలేక పోయారు..

దీంతో క్రింద ఉన్న వారు పెద్ద టెన్షన్‌కు గురయ్యారు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సైతం నచ్చజెప్పే ప్రయత్నం కూడా చేశారు..కాసేపు వారికి కూడా చుక్కలు చూపించిన ఆయన చివరికి శాంతించి కిందికి దిగాడు..  మొత్తం మీద భార్యలకు కాపురానికి రావాలని చాలా మంది భర్తలు నిరసనలు వ్యక్తం చేస్తూ..అందోళణ నిర్వహిస్తే..ఈ రివర్స్ భర్త మాత్రం భార్య ఇంటి నుండి పోవాలని నిరసన వ్యక్తం చేయడం చర్చనీయాంశం అయింది.
Published by:yveerash yveerash
First published: