Home /News /telangana /

PROTEST FOR JUSTIES TO TREE CUTTING AT JAGITYALA VRY KNR

Tree fight : "నా చెట్టుకు న్యాయం చేయండి" అంటూ ధర్నా చేసిన తమ్ముడు.. అధికారులు ఏం చేశారంటే..!

Tree fight

Tree fight

Tree fight : ఇద్దరు అన్నదమ్ముల ఆస్థుల పంచాయితీ చివరకు చెట్టుకు చేరింది.. తమ్ముడు అపురూపంగా పెంచుకున్న ట్టును అన్న అనవాళ్లు కూడా లేకుండా చేయడంతో ఓ తమ్ముడు ఆ ఇంటిముందే ధర్నాకు దిగాడు.

    ఆస్తి తగాదాలు ఒక్కొసారి అనేక పరిమాణాలకు దారి తీస్తాయి.. ముఖ్యంగా ఆస్థుల వివాదాల్లో హత్యలు కూడా జరగుతుంటాయి. అయితే కరీంనగర్(karimnagar) జిల్లాలో మాత్రం అన్నదమ్ముల మధ్య ఆస్థి వివాదం చెట్టు వేదికగా కొనసాగుతుంది. తమ్ముడి మీద కోపంతో పెంచుకున్న చెట్టును(tree) నరికి ఆనవాళ్లు లేకుండా పెట్రోల్ పోసి తగుల బెట్టాడు.

    దీంతో చెట్టును పెట్టి, నీళ్లు పోసి పెంచిన తమ్ముడు ధర్నాకు దిగాడు. తన అన్న తనపై కోపంతో చెట్టును నరికాడని ఏకంగా జిల్లా కలెక్టర్‌కే (collector) ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన స్థానిక మున్సిపల్ అధికారులు చెట్టు సంగతి తేల్చారు. ఫిర్యాదు అందుకుని విచారణ చేపట్టారు. అయితే విచారణలో చెట్టును కొట్టడంతో పాటు కాల్చినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అయితే చెట్టును ఎవరు కొట్టారనే దానికి మాత్రం సాక్ష్యాలు మాత్రం లభించలేదు. చుట్టుపక్కల వారిని విచారించినా.. ఎవరు చెప్పేందుకు ముందుకు రాలేదు.

     ఇది చదవండి : సీఎం కేసిఆర్ ఢిల్లీ టూర్.. మూడు రోజులు అక్కడే... కారణం ఇదే..!


    దీంతో మున్సిపల్ (muncipal) అధికారులు చట్ట ప్రకారం చెట్టు ఉన్న ఇంటి యజమానికి అయిదువేల రూపాయల జరిమాన విధించారు. చెట్టుకు బదులుగా మరో మొక్కను అక్కడే నాటించారు. కాని చెట్టును కొట్టినందుకు ఎవరిపై కేసులు మాత్రం నమోదు చేయలేదు. అయితే చెట్టును పెట్టిన వ్యక్తి మాత్ర తన అన్నపై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు.

    ఇది చదవండి : హుజురాబాద్ అభ్యర్థిపై కాంగ్రెస్ కసరత్తు.. ఆ మహిళ నేతకు మెజారిటీ నాయకుల మద్దతు..!


    ఈ సంఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. నగరంలోని ఎల్జీరాం లాడ్జి ప్రాంతానికి చెందిన ప్రభాకర్ కు అతని అన్న రాజేశ్‌కు భూ వివాదాలు కొనసాగుతున్నాయి. మొత్తం ఉన్న ఆస్థిని అందరికి పంచి ఇవ్వకుండా ఉమ్మడి ఆస్థిని అన్న రాజేశ్ ఒక్కడే అనుభవిస్తున్నాడని , ఉమ్మడి భూమిలో షట్టర్స్ నిర్మించి కిరాయి కూడా తానే అనుభవిస్తున్నాడని తమ్ముడు ప్రభాకర్ చెబుతున్నాడు. అయితే ప్రభాకర్ ఆ షట్టర్స్ ముందు ఆరు సంవత్సరాల క్రితం ఓ చెట్టును నాటాడు. అది పెరిగి పెద్దగా అయిన తర్వాత అన్న రాజేష్ షట్టర్స్ అడ్డం వస్తుందని నరికి పెట్రోల్ పోసి కాల్చేశాడు. దీంతో తనను వేధించేందుకే చెట్టును నరికాడని తమ్ముడు ప్రభాకర్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ప్రభాకర్‌కు జరిమానా విధించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Jagityala

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు