Women arrest : కరోనాతో ఆర్థికంగా చితికిపోయి.. తెలిసినవారితో కలిసి..
prostitute arrest
Woman arrest : కరోనాతో ఎన్నో కుటుంబాలను ఆర్ధిక చితికిపోయాయి. అయితే ఇలా ఆర్థికంగా ఇబ్బందుల పాలు ఓ మహిళ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడింది. తనకు తెలిసిన వారితో జట్టుకట్టి వ్యభిచారానికి దిగింది. తాజాగా బయటపడడంతో పోలీసులకు పట్టుపడ్డారు.
ఎల్బీనగర్ పోలీసులు ఓ వ్యభిచార గృహం గుట్టును రట్టు చేశారు. గృహం నిర్వాహకురాలితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేసి సెల్ఫోన్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా లక్ష్మీపురం కాలనీకి చెందిన ఎస్. వెంకటలక్ష్మి(68) బైరామల్‌గూడ రెడ్డి కాలనీలోని తన సోదరుడి ఇంట్లో కొంత కాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తోంది.
సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు శుక్రవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి విటుడు చట్టి సద్గుణరావుతో పాటు వెంకటక్ష్మిని అదుపులోకి తీసుకున్నారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెంకటలక్ష్మి సులభంగా డబ్బులు సంపాదించేందుకు వ్యభిచార వృత్తిని ఎంచుకున్నట్టు పోలీసులకు తెలిపింది. తనకు తెలిసిన సెక్స్‌వర్కర్లతో ఒప్పందం చేసుకుని వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కాగా, గతంలోనూ వెంకటలక్ష్మిని పోలీసులు వ్యభిచారం కేసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వెంకటలక్ష్మి మళ్లీ అదే వృత్తిని కొనసాగిస్తూ పట్టుబడింది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.