Home /News /telangana /

PROMOTION OF GOVERNMENT JUNIOR COLLEGES IN COMPETITION WITH PRIVATE COLLEGES IN MEDAK DISTRICT SNR MDK

Telangana : ప్రైవేట్‌ కాలేజీలకు ధీటుగా .. ప్రభుత్వ కళాశాలల ప్రచారం మెదక్‌ జిల్లాలో నూతన ఒరవడి

(ప్రైవేట్ కాలేజీలకు పోటీగా)

(ప్రైవేట్ కాలేజీలకు పోటీగా)

Medak: తెలంగాణలో పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అత్యుతత్తమ ప్రతిభను కనబర్చారు. గవ్నరెంట్ స్కూల్స్‌లో ఉత్తీర్ణత శాతం పెరగడం ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడి మార్కులు సాధించారు విద్యార్ధులు. ఫలితంగానే ప్రభుత్వ కాలేజీ అద్యాపకులు, అధికారులు ఇంటర్ మీడియట్ విద్యావ్యవస్థలో నూతన ఒరవడి సృష్టిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    (K.Veeranna,News18,Medak)
    తెలంగాణ(Telangana)లో పదవ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు అత్యుతత్తమ ప్రతిభను కనబర్చారు. గవ్నరెంట్ స్కూల్స్‌(Government Schools)లో ఉత్తీర్ణత శాతం పెరగడం ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడి మార్కులు సాధించారు విద్యార్ధులు. ఫలితంగానే ప్రభుత్వ కాలేజీ(Govt College)అద్యాపకులు, అధికారులు విద్యావ్యవస్థలో మార్పులు చేర్పులు చేపడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి మెదక్(Medak)జిల్లాలో ప్రైవేట్ కాలేజీ(Private college)లతో సమానంగా ప్రభుత్వ కాలేజీల్లో చేరేందుకు విద్యార్ధులకు ఇంటర్ విద్యకు సంబంధించిన వివరాలు, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే కెరియర్‌లో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను తెలియపరుస్తూ బ్రోచర్స్‌(Brochures)ప్రింట్ చేసి పంచుతున్నారు.

    ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా..
    ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మోడల్ జూనియర్ కాలేజీలతో పాటు ప్రభుత్వ జూనియర్ కాలేజీలు వందల సంఖ్యలో కాలేజీలు ఉన్నాయి. సుమారు 150 జూనియర్ కళాశాలలో ఉన్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి ఫీజులు వసూలు చేయడం తప్ప వాళ్లకు అవసరమైన విద్యాబోధన అందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నచోట్ల మంచి కాలేజీలు, అర్హత పొందిన అద్యాపకులు ఉన్నప్పటికి అడ్మిషన్ల విషయంలో ప్రైవేట్ కాలేజీకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.



    కొత్త ఒరవడి..
    జిల్లాలోని పేద విద్యార్దులకు, వారి తల్లిదండ్రులకు అగాహన కల్పించేలా ఈ ఏడాది కాలేజీ అడ్మిషన్‌ గురించి ప్రత్యేకించి బ్రోచర్స్‌తో ప్రచారం చేస్తున్నారు. ఇంటర్‌లో ఏ సబ్జెక్టు తీసుకుంటే భవిష్యత్తులో ఏ కోర్సులు చేయవచ్చు...ఏ గ్రూప్‌ తీసుకుంటే ఏ జాబు వస్తుందనే కీలక సమాచారంతో కూడిన కరపత్రాలను ప్రచూరించి ప్రభుత్వ జూనియర్ కాలేజీల లెక్చరర్స్ అర్ధమయ్యేలా చెబుతున్నారు. ఇంటర్‌మీడియట్‌లో హెచ్ఈసి సబ్జెక్టు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు వస్తాయంటూ లెక్చరర్స్‌ అవగాహన కల్పిస్తున్నారు.

    ఇది చదవండి: స్టేట్​ ర్యాంకులతో రికార్డులు సృష్టిస్తున్న ములుగులోని ప్రభుత్వ పాఠశాల.. వివరాలివే



    మీ భవిష్యత్తుకు మాది బాధ్యత..
    ప్రభుత్వ కాలేజీల్లో ఉండే అద్యాపకులు, సౌకర్యాలను నిరుపేద విద్యార్దులు ఉపయోగించాలని సూచిస్తున్నారు. తాజాగా వెలువడిన టెన్త్ ఫలితాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులే అత్యధిక మార్కులు సాధించారు. జిల్లాలోని సిద్దిపేటలో వందకు వందశాతం ఉత్తీర్ణ సాధించారు. తెలంగాణ రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలవడంతో 10వ తరగతి పాసైన విద్యార్థులు కూడా ప్రభుత్వ ఇంటర్‌ మీడియట్‌ కాలేజీలో చదవాలని నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించేలా శిక్షణ ఇస్తామని జూనియర్ కళాశాల లెక్చరర్స్ హామీ ఇస్తున్నారు.

    ఇది చదవండి: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ బ్యాంకుల్లో 308 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే


    Published by:Siva Nanduri
    First published:

    Tags: Intermediate, Medak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు