తిరుగుబాటు చెయ్యడానికి హరీష్ రావు... చంద్రబాబు టైపు కాదు... ప్రొఫెసర్ నాగేశ్వర్ సెన్సేషనల్ కామెంట్స్...

KCR Cabinet Update : తెలంగాణ ప్రభుత్వ మంత్రి వర్గ విస్తరణ తర్వాత హరీష్ రావు ఏం చేస్తారన్నదానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి రాజకీయ విశ్లేషణల్లో ఆరితేరిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏం చెప్పారు? ఎలా విశ్లేషించారు?

Krishna Kumar N | news18-telugu
Updated: February 20, 2019, 12:40 PM IST
తిరుగుబాటు చెయ్యడానికి హరీష్ రావు... చంద్రబాబు టైపు కాదు... ప్రొఫెసర్ నాగేశ్వర్ సెన్సేషనల్ కామెంట్స్...
కేసీఆర్, హరీష్ రావు (File)
  • Share this:
2014 ఎన్నికల తర్వాత... టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తర్వాత రెండో పొజిషన్ హరీష్ రావుదే అన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. అప్పట్లో కేటీఆర్ రోల్ చాలా చిన్నదన్న ఆయన... హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పార్టీలో కేటీఆర్ పాత్ర పెరిగిందని విశ్లేషించారు. ఆ ఎన్నికల్లో అపూర్వ విజయంతో కేటీఆర్ దూసుకొచ్చారన్న ఆయన... కేటీఆర్‌లో ఉన్న సామర్ధ్యాన్ని ప్రజలతోపాటూ, పార్టీ కూడా గుర్తించిందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల నాటికి హరీష్ రావును వెనక్కి నెట్టి కేటీఆర్ పార్టీలో సెకండ్ పొజిషన్‌కి వచ్చారన్నది కఠిన వాస్తవం అన్నారు నాగేశ్వర్. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి 17లో 14 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని విశ్లేషించిన ఆయన... ఎన్నికల తర్వాత కేటీఆర్ ప్రభ మరింత పెరగడం ఖాయమన్నారు. పార్టీలో సభ్యులంతా కేటీఆర్ మాటకు విలువ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

హరీష్ రావు సామర్ధ్యం ప్రజలకు, పార్టీకీ తెలుసన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. ట్రబుల్ షూటర్‌గా, సవాళ్లను ఎదుర్కొని ముందుకు వెళ్లే తత్వం హరీష్ రావులో ఉందన్నారు. తెలంగాణపై ఎలాగైతే కేసీఆర్‌కి పూర్తి స్థాయి పట్టుందో, ఆ తర్వాత అంతటి స్థాయిలో హరీష్ రావుకీ పట్టు ఉందన్నారు నాగేశ్వర్. వారసత్వ ప్రక్రియలో భాగంగా హరీష్ రావును పక్కన పెట్టారన్న ఆయన... కేటీఆర్‌ని ముఖ్యమంత్రిని చేస్తే, హరీష్ రావుకి ఉన్న అవకాశాలేంటన్న దానిపై తనదైన విశ్లేషణ ఇచ్చారు.


telangana cabinet, kcr cabinet expansion, harish rao options, nageshwar, telangana politics, ktr, harish rao, telangana news, telangana updates, kcr on national politics, why harish rao, harish rao on kcr, harish rao on ktr, తెలంగాణ కేబినెట్ విస్తరణ, హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్, మంత్రివర్గం, మంత్రులు, శాఖలు, నాగేశ్వర్
ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ (File)


1. జాతీయ రాజకీయాల్లో : కేసీఆర్‌తోపాటూ హరీష్ రావు కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న నాగేశ్వర్... అది మంచి నిర్ణయమవుతుందన్నారు. హరీష్ రావు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి కావచ్చని తెలిపారు.2. కేటీఆర్‌తోనే : కేటీఆర్ మంత్రివర్గంలో భాగస్వామి కావడాన్ని రెండో ఆప్షన్‌గా చెప్పారు నాగేశ్వర్. హరీష్ రావు... కేటీఆర్ కంటే ముందు నుంచీ రాజకీయాల్లో ఉన్నా... రాజకీయాల్లో సీనియార్టీ కంటే... అవకాశాలతోనే సంబంధం ఉంటుందన్నారు. పరిస్థితుల్ని బట్టీ కేటీఆర్ నేతృత్వంలో జూనియర్ రోల్‌కి హరీష్ రావు ఒప్పుకోవాల్సి ఉంటుందన్నారు.

3. పార్టీపై తిరుగుబాటు : చాలా మంది అనుకుంటున్నట్లు పార్టీపై హరీష్ రావు తిరుగుబాటు చెయ్యాలంటే... కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉండి... వాళ్లు హరీష్ రావుకు మద్దతిచ్చే పరిస్థితి రావాలన్నారు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీకి కేసీఆర్‌తో అవసరం ఉందన్న నాగేశ్వర్... తెలంగాణలో బీజేపీకి గానీ, కాంగ్రెస్‌కి గానీ ప్రభావం లేనందువల్ల... ఆ రెండు పార్టీలూ హరీష్ రావుకి మద్దతిచ్చే పరిస్థితి ఉండదన్నారు. అందువల్ల ఇప్పట్లో తిరుగుబాటుకు ఛాన్స్ లేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబులా మామకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే టైపు హరీష్ రావు కాకపోవచ్చన్నారు నాగేశ్వర్

4. కేసీఆర్ నేతృత్వంలోనే : లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో టీఆర్ఎస్ భాగస్వామి కాకపోతే... రాష్ట్రంలో కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉంటారన్న నాగేశ్వర్... ఆయన నేతృత్వంలో కేటీఆర్, హరీష్ రావు మంత్రులుగా కొనసాగుతారనీ అది మరో ఆప్షన్ అనీ సెలవిచ్చారు. 

ఇవి కూడా చదవండి :


పాకిస్థాన్‌తో టీంఇండియా ఆడాలా వద్దా... బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టిన బీసీసీఐ


పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ ఏపీలో పెట్రోల్ అమ్మకాలకు షార్ట్ బ్రేక్...


రూ.5 లక్షలిస్తా... ప్రమోషన్ కోసం లంచం ఆఫర్... సస్పెండ్ అయిన ఉద్యోగి

First published: February 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>