తెలంగాణ నిర్భయ హత్యపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆవేదన

Telangana : పశు వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది. నేతలు, ప్రముఖులు, సినీ స్టార్స్ ఎవరికి వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: December 1, 2019, 7:19 AM IST
తెలంగాణ నిర్భయ హత్యపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆవేదన
ప్రియాంక గాంధీ
  • Share this:
Telangana : తెలంగాణ నిర్భయ హత్య కేసులో నిందితులకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో... వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసుపై శనివారం షాద్‌నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతం అట్టుడికిపోయింది. పోలీస్ స్టేషన్‌లో ఉన్న నిందితుల్ని తమకు అప్పగించాలనీ, తామే వాళ్లకు శిక్ష వేస్తామనీ వేల మంది ప్రజలు ఆందోళనకు దిగారు. ఆగ్రహావేశాలతో రగిలిపోతున్న వారిని కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు నానా తిప్పలు పడ్డారు. మరోవైపు ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కర్నీ కదిలిస్తోంది. నేతలు, ప్రముఖులు, సినీ స్టార్స్ ఎవరికి వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దీనిపై స్పందించారు. శంషాబాద్‌లో యువ పశువైద్యురాలిపై అత్యాచారం, హత్య... ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో టీనేజీ అమ్మాయిపై జరిగిన రేప్... క్రూరమైన చర్య అని... ఈ సంఘటనలు తనని తీవ్రంగా కలిచివేశాయని ప్రియాంక గాంధీ ట్విటర్‌లో తెలిపారు. ఈ హేయమైన చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవని ఆమె అన్నారు. ఇలాంటి భయంకర ఘటనలు జరిగిప్పుడు మనం మాట్లాడటం కంటే చేయాల్సింది చాలా ఉందని ఆమె అన్నారు. తెలంగాణ నిర్భయ హత్యాచార ఘటనపై బాలీవుడ్ నుంచీ టాలీవుడ్‌ వరకూ సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, మహిళా సంఘాలు, విద్యార్థులు అందరూ ఖండిస్తున్నారు. క్యాండిల్ ర్యాలీలు చేపట్టి బాధితురాలి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. అలాగే నిందితులకు ఉరి శిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.


Pics : అందాల నయాగరా... సురభి క్యూట్ ఫొటోస్


ఇవి కూడా చదవండి :

పడిపోతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్... ఇవీ కారణాలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా... ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లో మరో దారుణం... సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై రేప్?

నేడు ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ సమావేశం, ఆర్టీసీపై చర్చ

Health Tips : పొట్ట తగ్గాలా... చెరుకు రసాన్ని ఇలా తాగితే సరి...
Published by: Krishna Kumar N
First published: December 1, 2019, 7:19 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading