హైదరాబాద్ శివారుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

రోడ్డుకు అడ్డంగా బస్సు బొల్తా పడడంతో క్రేన్ సాయంతో బస్సును పక్కకు తొలగిస్తున్న క్రమంలో క్రేన్ సైతం బోల్తా పడింది.

news18-telugu
Updated: December 3, 2019, 8:09 AM IST
హైదరాబాద్ శివారుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా
బోల్తాపడిన ట్రావెల్స్ బస్సు ( ఫైల్ ఫోటో)
  • Share this:
శంషాబాద్‌లో రోడ్డు ప్రమాద చోటు చేసుకుంది. మదనపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడ్డవారిని దగ్గర్లో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ తో సహా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మితిమీరిన వేగం...... వర్షం పడుతుండడంతో బస్సు బొల్తా పడినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. హైదరాబాదు నుండి చిత్తూరు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. రోడ్డుకు అడ్డంగా బస్సు బొల్తా పడడంతో క్రేన్ సాయంతో బస్సును పక్కకు తొలగిస్తున్న క్రమంలో క్రేన్ సైతం బోల్తా పడింది. దీంతో మరో క్రేన్‌ను ఘటనా స్థలానికి తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టారు.
Published by: Sulthana Begum Shaik
First published: December 3, 2019, 8:09 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading