నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇంట్లోనే ఊరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. బల్మూర్ మండలం తుమ్మంపేట కు చెందిన మంజూర్ అహ్మద్(54) కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నారు. గత 30 ఏళ్లుగా అచ్చంపేటలోనే ఉంటున్నారు. ది విమలాస్ ఇచ్ డయాన్ ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. అయితే ఆదివారం తన భర్యాను బీపీ ట్యాబ్లెట్స్ కోసం బయటకు పంపించాడు. ఆమె బయటకు వెళ్లగానే ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఆయన మరణానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.
కానీ స్థానికులు మాత్రం ఇబ్బందుల కారణంగానే ప్రిన్సిపాల్ మంజూర్ అహ్మద్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కొన్ని నెలల నుంచి పాఠశాలలు బంద్ కావడం కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నందునే ప్రిన్సిపాల్ ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా స్థానికంగా పలువురు అనుకుంటున్నారు.ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా.. ఇప్పటివరకు ఫిర్యాదు అందలేని ఎస్ఐ ప్రదీప్ కుమార్ తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Published by:Sumanth Kanukula
First published:December 21, 2020, 15:09 IST