Private Hospitals : మరిన్ని ఆసుపత్రులపై చర్యలు..కొవిడ్ చికిత్స అనుమతి రద్దు..జిల్లాల్లో పర్యటిస్తున్న ఉన్నతాధికారులు

మరిన్ని ఆసుపత్రులపై చర్యలు..కొవిడ్ చికిత్స అనుమతి రద్దు..జిల్లాల్లో పర్యటిస్తున్న ఉన్నతాధికారులు

Private Hospitals Licence : ప్రైవేటు ఆసుపత్రుల కరోనా దోపిడికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది..ప్రభుత్వ నిబంధలనకు విరుద్దంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రులపై కొరఢా ఝలిపిస్తోంది..ఇప్పటికే వాటికి నోటిసులు ఇచ్చి సరైన సమాధానం రాకపోతే ఆసుపత్రుల అనుమతులను రద్దు చేస్తోంది.

  • Share this:
గత రెండు మూడు రోజులుగా ఆసుపత్రులకు నోటిసుటు ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటికే పలు ఆసుపత్రుల అనుమతిని రద్దు చేసింది. కోవిడ్ ట్రీట్‌మెంట్ ఇవ్వకుండా ఆయా ఆసుపత్రులను కట్టడి చేస్తోంది.ఇలా ఇప్పటికే పలు ఆసుపత్రులకు కోవిడ్ చికిత్స అనుమతిని రద్దు చేసింది.. తాజాగా మరో ఆరు పత్రులపై చర్యలు తీసుకుంది.. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘంచడంతో విచారణ జరిపి వాటికిచ్చిన కోవిడ్ అనుమతిని రద్దు చేసింది.

తాజాగా అనుమతులు రద్దు చేసిన వాటిలో కూకట్ పల్లిలోని పద్మజ ఆసుపత్రి, అల్వాల్ లైఫ్ లైన్ మెడిక్యూర్ ఆసుపత్రులతోపాటు ఉప్పల్ లోని టీఎక్స్ ఆసుపత్రి పైనా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. వీటితోపాటు వరంగల్ లోని మ్యాక్స్ కేర్, లలిత ఆసుపత్రితో పాటు సంగారెడ్డిలో శ్రీసాయిరామ్ ఆసుపత్రులకు కరోనా చికిత్స అందించే అనుమతిని రద్దు చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న వారికి చికిత్స అందించి ..భవిష్యత్‌లో కోవిడ్ సోకిన వారికి చికిత్స ఇవ్వకుండా చర్యలు చేపట్టింది.

ఇక ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం మొత్తం 30 ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నట్టు సమాచారం. కాగా ఖమ్మంలో కూడ మరో 10 ఆసుపత్రుల అనుమతిని కూడ రద్దు చేసింది. కాగా ముందుగా 64 ఆసుపత్రులకు అనంతరం మరిన్ని ఆసుపత్రులపై ఆరోపణలు రావడంతో మొత్తం 105 ఆసుపత్రులపై వాటికి షోకాజ్ నోటీసులు అందించింది. నోటిసులు అందుకున్న ఆసుపత్రుల యాజమాన్యం 24 గంటల్లో స్పందించాల్సి ఉంటుంది..వారు ఇచ్చిన సమాధానం సంతృప్తిగా లేకపోతే అనుమతులు రద్దు నిర్ణయాలు తీసుకుంటున్నారు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.

ప్రభుత్వం ఇన్ని చర్యలు చేపడుతున్నా.. కొన్ని ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కోసం లక్షల రూపాలయలను వసూలు చేస్తున్నారు..కనీసం వాటికి బిల్లులు కూడ ఇవ్వకుండా రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇదిలా ఉంటే..తాజాగా బ్లాక్ ఫంగస్‌ రోగులకు కూడ ఇదే విధమైన బిల్లులను ఆయా ఆసుపత్రులు చార్జీలు వేస్తున్నాయి..ఒక్కో రోగికి కనీసం 15 లక్షల రూపాలయలు చికిత్స కోసం బిల్లులు వేస్తున్న పరిస్థితి నెలకొంది..ప్రభుత్వం వీటిపై కూడ చర్యలు తీసుకుంటే రోగులు కాస్త ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి.
Published by:yveerash yveerash
First published: