హోమ్ /వార్తలు /తెలంగాణ /

కరోనా సోకి భర్త మరణం.. కోర్టు మెట్లెక్కిన భార్య.. ఏం జరిగిందంటే..

కరోనా సోకి భర్త మరణం.. కోర్టు మెట్లెక్కిన భార్య.. ఏం జరిగిందంటే..

తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

చికిత్స అందించడానికి ముందే ఆస్పత్రి యాజమాన్యం రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయించుకుంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మోహన్ బాబు మరణించాడు.

తెలంగాణలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కరోనా చికిత్స చేయించుకునేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులిచ్చింది. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో ఏర్పడిన విపత్కర పరిస్థితుల్లో రోగుల పట్ల ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో అతడిని భార్య ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించాడు. చికిత్స పొందే క్రమంలో పరిస్థితి విషమించి ఆ వ్యక్తి చనిపోయాడు. చికిత్సకు అందించినందుకు గాను ఆ ఆస్పత్రి యాజమాన్యం అక్షరాల రూ.6 లక్షల బిల్లు వేసింది. డబ్బు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని నిర్వాహకులు తేల్చిచెప్పారు. దీంతో ఆ మహిళ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. మూసాపేట ప్రాంతానికి చెందిన మోహన్ బాబు కరోనా వైరస్ సోకడంతో జూలై 14, 2020వ తేదీన నానక్‌రామ్‌గూడలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరాడు.

చికిత్స అందించడానికి ముందే ఆస్పత్రి యాజమాన్యం రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయించుకుంది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మోహన్ బాబు మరణించాడు. అతడికి చికిత్స అందించినందుకు మొత్తంగా రూ.6 లక్షల బిల్లు వేసింది. ఆ బిల్లు చెల్లిస్తేనే మృతదేహాన్ని ఇస్తామని అతడి భార్యకు చెప్పింది. అసలే భర్త చనిపోయి పుట్టేడు దుఖంలో ఉన్న ఆమెకు ఆస్పత్రి యాజమాన్యం కనీస మానవత్వం లేకుండా రూ.6 లక్షలు చెల్లించాలని చెప్పడం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. స్పందించిన కోర్టు ఏలాంటి ఆర్డర్స్ ఇవ్వకుండానే పోలీసుల సమక్షంలో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పింది.

రూ.6 లక్షల బిల్లును మాఫీ చేసింది. ఆస్పత్రి యాజమాన్య తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ చేసి నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశించింది. ఇదిలావుంటే.. ప్రభుత్వం నిర్దేశించిన ధరలు కాకుండా.. ప్రైవేటు ఆస్పత్రులు లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. కనీసం చనిపోతే చివరకు మృతదేహాలను సైతం అప్పగించడం లేదు.

First published:

Tags: Corona virus, High Court, Telangana

ఉత్తమ కథలు