Home /News /telangana /

PRIVATE HOSPITAL OWNERS HAVE DECIDED TO PROVIDE KOVID TREATMENT AT THE LOWEST POSSIBLE COST IN MAHABUBNAGAR DISTRICT VB MBNR

Lowcost covid Treatment: ఆ జిల్లాలో తక్కువ ధరకు కోవిడ్ చికిత్స.. ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాల నిర్ణయం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Lowcost covid Treatment: రోజురోజుకు కరోనా వ్యాపిస్తుండగా లక్షలకు లక్షలు బిల్లులు చెల్లించి ప్రైవేట్ ఆస్పత్రులలో చికిత్స పొందలేని పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చొరవ తీసుకున్నారు. అతి తక్కువ ధరకు కోవిడ్ చికిత్స అందిచేందుకు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు ఒప్పుకున్నట్లు తెలిపారు.

ఇంకా చదవండి ...
  (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

  ప్రభుత్వం నిర్దేశించిన 20 శాతం పడకలతో కరోనా పేషెంట్ లకు వారం రోజులపాటు ఆక్సిజన్ లేకుండా చికిత్స అందిస్తే కేవలం రూ. 30 వేలు.. ఆక్సిజన్ తో రూ.60 వేలకు చికిత్స అందించేలా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు సంయుక్తంగా అంగీకరించాయి. ఇందుకుగాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కరోనాపై జిల్లా అధికారులు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తో మంత్రి సమావేశం నిర్వహించారు. కరోనా కష్ట కాలంలో పేద రోగులను బతికించడమే ఏకైక లక్ష్యంగా తాము పని చేస్తున్నామని ,ఇందుకు ప్రభుత్వ సహకారానికి ప్రైవేటు ఆసుపత్రులు కూడా పూర్తి మద్దతు తెలిపాయని మంత్రి తెలిపారు. రెండు రోజుల క్రితం జిల్లాలోని అన్ని డయాగ్నిస్టిక్ కేంద్రాలు కేవలం రూ. 1999లకే సిటీ స్కాన్ చేసేందుకు అంగీకరించగా.. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కేవలం 30 వేల రూపాయలకు వారం రోజులపాటు ఆక్సిజన్ లేకుండా వివిధ పరీక్షలతో సహా చికిత్స అందించేందుకు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ప్రైవేటు ఆసుపత్రులలో కూడా అన్ని సౌకర్యాలను కలగజేశామని తెలిపారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇదివరకే 261 ఆక్సీజన్ పడకలు ఉండగా, మరో 250 పడకల ను త్వరలోనే ఆక్సిజన్ తో సహా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.

  ప్రైవేట్ డాక్టర్లు అత్యంత తక్కువ ధరకు వైద్యం అందించడంలో దేశంలోనే మహబూబ్నగర్ జిల్లా ముందు స్థానంలో ఉందని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ,ప్రైవేటు ఆసుపత్రులు స్వచ్ఛంద సంస్థలు కలిసికట్టుగా ఐక్యంగా పనిచేయడం వల్లనే కరోనా తగ్గుముఖం పట్టిందని ,కరోనా చికిత్సకు హైదరాబాద్ కు వెళ్లే వారి శాతం తగ్గిందని, మంత్రి వెల్లడించారు. కరోనా నియంత్రణలో భాగంగా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టిందని, ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో గ్రామాలలో జ్వరం, దగ్గు, జలుబు వచ్చిన వారిని గుర్తించడం, వారికి కరోనా కిట్లు అందించి వ్యాధి విస్తరించకుండా చూస్తున్నామని, ఇప్పటివరకు జిల్లాలో సుమారు 10100 కిట్లను అందజేయడం జరిగిందని ఆయన వెల్లడించారు . అంతేకాక జిల్లాలో అవసరమైన చోట కోవిడ్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని, వీటికి తోడు 3 సంచార అంబులెన్స్ లు ఏర్పాటుచేసి రోగుల ఇంటికి వెళ్లి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరో రెండు రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 4 బస్తీ దవాఖానాలను ప్రారంభించనున్నామని మంత్రి వెల్లడించారు. ఎక్కడైనా గ్రామాలలో కరోనా వ్యాధి ముదిరినట్లయితే ఇందుకు సంబంధించి సంబంధిత ఏఎన్ ఎం, పంచాయతీ కార్యదర్శులను వివరణ కోరుతున్నామని చెప్పారు.

  జిల్లాలో సుమారు 92 వేల మందికి మొదటి డోస్ వాక్సిన్ ఇవ్వడం జరిగిందని, రెండో డోస్ 22,600 మంది కి ఇచ్చామని ,100% వ్యాక్సిన్ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు ఎలాంటి బ్లాక్ ఫంగస్ కేసులు లేవని, మహబూబ్ నగర్ కు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని జిల్లాలకు చెందిన ఇతర జిల్లాల నుండి కూడా ఎక్కువగా చికిత్స కోసం ఇక్కడికి వస్తారని ,భవిష్యత్తులో కూడా రాయచూరు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వైద్యం నిమిత్తం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయని , వీటిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో వైద్య సేవలను విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా అవసరమైన మేరకు మందులు, ఆక్సిజన్,రేమిడివిసివిర్ ఇంజక్షన్లు సిద్ధంగా ఉండేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లాలోని అన్ని ప్రైవేట్ హాస్పిటల్ లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాయని, అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసే వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

  ఈ సందర్భంగా మంత్రి ఒక్కొక్క ఆసుపత్రి వారిగా అందుబాటులో ఉన్న మొత్తం బెడ్లు ,ఇప్పటి వరకూ చికిత్స అందించిన పేషెంట్లు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న బెడ్లు, వెంటిలేటర్లు ,ఆక్సిజన్ సదుపాయం ఇతర వివరాలను ఆసుపత్రి వారీగా సమీక్షించారు. మంత్రి ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు పలు సూచనలు చేస్తూ కేవలం బెడ్లు మాత్రమే ఉన్న ఆసుపత్రుల వారు ఇతర ఆసుపత్రులు లేదా ప్రభుత్వ ఆసుపత్రి తో ఒప్పందం కుదుర్చుకుని ఎవరైనా కరోనా తీవ్రంగా ఉన్న రోగులు వచ్చినట్లయితే ప్రభుత్వ ఆస్పత్రి కి లేదా ప్రైవేట్ ఆసుపత్రులకు పంపే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు .అదేవిధంగా చిన్న పిల్లలకు కూడా ఒక వేళ కరోనా సోకితే తక్షణమే వైద్య సదుపాయాలు అందించే విధంగా రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ లో కూడా బెడ్లను పెంచాలని రవి చిల్డ్రన్స్ అధినేత డాక్టర్ శేఖర్ కు సూచించారు.

  ప్రైవేట్ ఆసుపత్రులలో ఆక్సిజన్, సిలిండర్ ఇతర మందులకు సమస్య ఏర్పడినట్లయితే తక్షణమే వారితో మాట్లాడి సమస్యను తీర్చే విధంగా చూడాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కృష్ణ ను మంత్రి ఆదేశించారు .అదేవిధంగా ఎక్కడైనా మందులు లేకుంటే మాట్లాడి ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, ఆక్సీజన్ ,రేమిడి విసి ఆర్ఇంజక్షన్లకు ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ప్రజల ప్రాణాలను కాపాడటం ధ్యేయంగా జిల్లా నుండి హైదరాబాద్ కి వెళ్ళకుండా ఇక్కడే పూర్తిస్థాయిలో చికిత్స అందించే విధంగా చూడాలని మహబూబ్ నగర్ జిల్లా తోపాటు నారాయణపేట, షాద్ నగర్ ఇతర జిల్లాల వారికి కూడా చికిత్స అందించేందుకు జిల్లా వైద్యులు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు .ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు డాక్టర్లతో ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న బెడ్లు, ఆక్సిజన్, ఇతర మందులు, వివరాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Corona, Covid treatment, Lowcost, Mahabubnagar, Srinivas goud

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు