హాస్టల్‌లో నీటి కొరత... బాలికల జుట్టు కత్తెరించిన ప్రిన్సిపాల్

గిరిజన మినీ గురుకుల పాఠశాలలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో నీటికొరతను తగ్గించేందుకు హాస్టల్‌లో ఉండే బాలికల విషయంలో ప్రిన్సిపాల్ అందరీకి జుట్టు కత్తెరించేశారు.

news18-telugu
Updated: August 13, 2019, 3:35 PM IST
హాస్టల్‌లో నీటి కొరత... బాలికల జుట్టు కత్తెరించిన ప్రిన్సిపాల్
principal secisers student hair due to water crisis in hostel, హాస్టల్‌లో నీటి కొరత... బాలికల జుట్టు కత్తించిన ప్రిన్సిపాల్
news18-telugu
Updated: August 13, 2019, 3:35 PM IST
హాస్టల్ ప్రిన్సిపాల్ ఓవరాక్షన్ చేసింది. గురుకుల బాలిక వసతి గృహంలో ఉన్న పిల్లలందరి జుట్టు కత్తెరించింది. నీట కొరత ఎక్కువగా ఉందని ఆమె ఈ అరాచకానికి పాల్పడింది. మెదక్ జిల్లా కేంద్రంలో గిరిజన మినీ గురుకుల పాఠశాలలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో నీటికొరతను తగ్గించేందుకు హాస్టల్‌లో ఉండే బాలికల విషయంలో ప్రిన్సిపాల్ అనూహ్య ఈ  నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అమ్మాయిలు తలస్నానం చేసేందుకు అధిక నీరు అవసరం మవుతోంది.. అందుకని స్నానాల కోసం నీటి కొరత ఉందంటూ బాలికల జుట్టు కత్తిరించారు ప్రిన్సిపాల్ అరుణ. అంతేకాదు జుట్టు కత్తెరించేందుకు అందరి దగ్గర ఆమె రూ. 25 కూడా వసూలు చేసింది.

స్థానిక గిరిజన మినీ గురుకుల పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు 180 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  ఆ పాఠశాల ఆవరణలో నీటి కొరత ఉందని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ 180 మంది విద్యార్థులు జుట్టు కత్తిరించి.. అమ్మాయిలందరికీ బాయ్ కట్ చేసేశారు. అయితే సోమవారం సెలవు కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని కలిసేందుకు అక్కడు వెళ్లారు. అంతే తమ పిల్లలందర్నీ బాయ్‌కట్‌లో చూసి షాక్ తిన్నారు. తమకు కనీసం సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల జుట్టులను ఎలా కత్తిరిస్తారు అంటూ ప్రిన్సిపాల్ ను నిలదీశారు. కొందరు చిన్నారులు జుట్టు కత్తెరించేటప్పుడు ఆవేదనకు గురయ్యారు.First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...