Home /News /telangana /

PRIME MINISTER NARENDRA MODI TODAY GOING TO VISIT ICRISAT WHICH IS LOCATED IN SANGAREDDY HERE THE FEW SPECIAL DETAILS ABOUT THE ICRISAT MDK PRV

Icrisat: నేడు సంగారెడ్డిలోని ఇక్రిశాట్​కు రానున్న ప్రధాని మోదీ.. ఈ ఇక్రిశాట్​ ప్రత్యేకత ఏంటి..? ఇక్కడ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు.. స్పెషల్ స్టోరీ మీ కోసం..

మోదీ ఇక్రిశాట్​ టూర్​

మోదీ ఇక్రిశాట్​ టూర్​

తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం ఇక్రిశాట్​ను సందర్శించి, స్వర్ణోత్సవంలో పాల్గొననున్నారు. అయితే ఈ ఇక్రిశాట్​ ప్రత్యేకతలు ఏంటి.. ప్రధాని రావడానికి ఉన్న ఆవశ్యకత, ఇక్రిశాట్​ గొప్పదనం ఒకసారి తెలుసుకుందాం..

    (News 18 ప్రతినిధి, కె.వీరన్న,మెదక్ జిల్లా)

    ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ఉత్పత్తులు అందడం ప్రపంచానికి పెద్ద సవాల్ గా మారింది. ఈ నేపథ్యంలో  సమస్యను అధిగమించేందుకు అధిక దిగుబడులను ఇచ్చే వంగడాల సృష్టి, వాటికి అనుగుణమైన సాగు పద్ధతులపై ఇక్రిశాట్ (International Crops Research Institute for the Semi-arid Tropics) చేస్తున్న పరిశోధనకు 50 ఏళ్లు పూర్తయింది. ఇక్రిశాట్​ స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (PM narendra Modi)  శనివారం ఈ సంస్థను సందర్శించి , స్వర్ణోత్సవంలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటన (PM Icrisat visit) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా పటాన్​చెరులో 1972లో ఇక్రిశాట్​ (Icrisat) స్థాపించారు. ఇక్రిశాట్ (Icrisat)​ నిర్మాణానికి మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. సుమారు 3,400 ఎకరాల్లో ఈ పరిశోధన సంస్థ విస్తరించి ఉంది. ఉష్ణ మండల ప్రాంతాలైన ఆఫ్రికా, ఆసియాలోని దేశాలకు ఈ సంస్థలో సభ్యత్వం ఉంది.

    ఆయా పంటలు జన్యు మార్పులపై..

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు అంతర్జాతీయ సంస్థల ఆర్థిక సహాయంతో ఇక్కడ  పరిశోధనలు (Research) కొనసాగుతున్నాయి. ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, సజ్జ, శనగ, వేరుశనగ, కు వంటి పంటలపై పరిశోధనలు, ఆయా పంటలు జన్యు మార్పులపై ఈ సంస్థలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. పరిమిత భూ వనరులు, పెరుగుతున్న ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని పంటల సాగు విధానం (Crop cultivation system), దిగుబడి పెంచే వంగడాలను కనుగొనడంలో ఈ సంస్థ ముందుంది.

    ఇక్రిశాట్​


    ఇటీవల చిరుధాన్యాలు చిన్నారుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై ఇక్రిశాట్ (Icrisat) శాస్త్రవేత్తలు ఇండియన్ నేషనల్ ఇనిస్టి ట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థతో కలిసి పరిశోధనలు చేశారు. కొర్రలు, అరికలు, సామలు, రాగులు ఆహారంగా తీసుకున్న చిన్నారుల ఎదుగుదల బాగుందని తేల్చారు. గత ఏడాది అక్టోబర్ కూడా శనగ పంటకు సంబంధించి మూడు నూతన వంగడాలను (New seeds) రూపొందించింది. 4005 ఎల్ 4-14, ఐసీసీఎంబీ 19-3 రకం వంగడాలు. కరువు నేలలను తట్టుకోవడంతో పాటు రోగా లను సమర్థంగా ఎదుర్కొని అధిగ దిగుబడులు ఇస్తాయని ఇక్రిశాట్ ప్రకటించింది.

    ఇక్రిశాట్​


    జొన్న నుంచి ఐదనాల్ ఉత్పత్తి చేసే వెరైటీ ఇక్రిశాట్ 2007లో రూపొందించింది. ఈ వెరైటీ. విత్తనాలతో జొన్న పంట దిగుబడిని పెంచింది. 120 రోజుల పంట కాలాన్ని 90 రోజుల్లో దిగు బడి వచ్చేలా వంగడాలను తయారు చేసింది. ఇక్రిశాట్ (Icrisat) శాస్త్రవేత్తలు సృష్టించిన జొన్నలోని కొత్త రకం వంగడాలు 46 దేశాలలో సంస్థ మైలు రాళ్లను అధిగమించింది.

    ఎన్నో అద్భుత వంగడాలు..

    ఇక్రిశాట్ (Icrisat) 50 ఏళ్ల పరిశోధన కాలంలో ఎన్నో అద్భుత వంగడాలను కనుగొంది. అత్యధిక ఉష్ణోగ్రతలుండే ప్రాంతాలు, కరువు కాట కాలను తట్టుకోగలిగి అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను ఈ సంస్థ సృష్టించింది.  వర్షపు నీటి సంరక్షణ సంస్థలతోనూ ఈ సంస్థ కలిసి పనిచేస్తోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: PM Narendra Modi, Sangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు