తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra modi) ఇక్రిశాట్‌కు (icrisat) చేరుకున్నారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై , సీఎస్ సోమేశ్ కుమార్ ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) ఇక్రిశాట్‌కు (icrisat) చేరుకున్నారు. అంతకుముందు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), గవర్నర్ తమిళిసై, సీఎస్ సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు మోదీ వెళ్లారు. ఈ సందర్భంగా ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక లోగోను ప్రధాని ఆవిష్కరించారు. అనంతరం పంటల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. అలాగే శాస్త్రవేత్తలను ఉద్దేశించి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రసంగించనున్నారు. తర్వాత ముచ్చింతల్‌లోని చినజీయర్ ఆశ్రమానికి చేరుకుని.. అక్కడ రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటారు. 216 అడుగుల ఎత్తైన సమతామూర్తి విగ్రహానికి మోదీ.. చినజీయర్ స్వామితో కలిసి పూజచేస్తారు. తర్వాత సమతామూర్తి విగ్రహాన్ని (Samatha Murthy Statue) జాతికి అంకితమివ్వనున్నారు. అనంతరం ఢిల్లీ తిరిగి వెళ్లనున్నారు.
అయితే ప్రధాని మోదీ (PM Modi) పర్యటకు తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ఆయన జ్వరం, స్వల్ప అస్వస్థతతో బాధపడంతో ప్రధాని పర్యటనకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీకి స్వాగతం, వీడ్కోలు పలికేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించింది.
Telangana: PM Narendra Modi joins the 50th Anniversary celebrations of the International Crops Research Institute for Semi-Arid Tropics (ICRISAT) in Patancheru, Hyderabad.
Telangana Governor Tamilisai Soundararajan and Union Agriculture Minister Narendra Singh Tomar also present pic.twitter.com/7VXGnrxl2g
భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు వెళ్లారు. అక్కడ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో (Golden Jubilee events) పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్రిశాట్ నూతన లోగోను ఆవిష్కరిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకుంటారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక.. యాగశాలలో పూర్ణాహుతి, విశ్వక్సేన ఇష్టి హోమంలో పాల్గొంటారు. తర్వాత దివ్యక్షేత్రాలను, రామానుజుల బంగారు విగ్రహం ప్రతిష్టాపన స్థలాన్ని పరిశీలిస్తారు.
8.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ..
శనివారం సాయంత్రం 6.15 గంటల నుంచి రామానుజుల విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆవిష్కరిస్తారు. సుమారు 7 గంటల సమయంలో ప్రసంగం చేస్తారు. అనంతరం రుత్విక్కుల నుంచి వేదాశీర్వచనం, చినజీయర్ స్వామి నుంచి మహా ప్రసాదాన్ని అందుకుంటారు. అనంతరం 8.20 గంటలకు ముచ్చింతల్ ఆశ్రమం నుంచి రోడ్డు మార్గంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరుతారు. అక్కడి నుంచి 8.40 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళతారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.