ఈ ఏడాది బ్రిటన్‌లోని బర్మింగ్‌హమ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో (Commonwealth games) 22 స్వర్ణ పతకాలను భారత ఆటగాళ్లు సాధించారు. అందులో బాక్సింగ్ విభాగంలో తెలంగాణ మణిహారం నిఖత్ జరీన్ (Nikhat Zareen) తన పంచ్ పవర్‌తో బంగారు పతకం సైతం సాధించింది. అయితే.. కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు పసిడి పతకాన్ని సాధించి పెట్టిన మహిళా బాక్సర్ (Woman Boxer) నిఖత్ జరీన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra modi) ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా ఆమెకు అపురూక కానుకగా గ్లౌజులను (Gloves) పీఎం బహూకరించారు.
ఢిల్లీకి పిలిపించిన మోదీ..
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ తరఫున పాలుపంచుకున్న క్రీడాకారులతో ప్రత్యేకంగా భేటీ అయిన మోదీ…వారి ప్రతిభను కీర్తించారు. ఈ దఫా కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ క్రీడా సంబరాలు ముగియగా… క్రీడాకారులంతా దేశం చేరుకున్నారు. వీరందరినీ ఢిల్లీకి పిలిపించిన మోదీ… దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన క్రీడాకారులను ఆయన మెచ్చుకున్నారు. ఈ సందర్భంగానే నిఖత్ జరీన్‌ను ప్రత్యేకంగా సన్మానించిన మోదీ… ఆమెకు గ్లౌజులను (Gift) బహూకరించారు.
Some more glimpses from the memorable interaction with India's athletes, who have made us proud at the 2022 CWG. pic.twitter.com/hRlTFJDVru
— Narendra Modi (@narendramodi) August 13, 2022
15 ఏండ్ల వయస్సులోనే..
నిజామాబాద్ (Nizamabad) జిల్లాకు చెందిన మహ్మద్ జమీల్ అహ్మద్-పర్వీన్ సుల్తానాల కూతురు జరీన్. నిఖత్ జరీన్ 1996 జూన్ 14న జన్మించింది. పొట్టకూటి కోసం జమీల్ గల్ఫ్ లో కొన్నాళ్లు సేల్స్ ఆఫీసర్ గా పని చేసి వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. చిన్నప్పట్నుంచే బాక్సింగ్ మీద మక్కువ పెంచుకున్న జరీన్.. 13 ఏండ్లలో తన వయసు పిల్లలంతా వీధుల వెంబడి ఆడుకోవడానికి వెళ్తే తాను మాత్రం చేతులకు బాక్సింగ్ గ్లౌజులు వేసుకుంది. పదో తరగతి వరకు నిజామాబాద్‌లోని నిర్మల హృదయ హైస్కూల్ (Nirmala Hridaya High School)లో చదివిన ఆమె కాకతీయ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసింది. 15 ఏండ్ల వయస్సులోనే బాక్సింగ్ (Boxing) ప్రాక్టీస్ ప్రారంభించిన ఆమెకు తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం లభించింది.
నిజామాబాద్ (Nizamabad) లోని షంసముద్దీన్ దగ్గర బాక్సింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టిన ఆరు నెలలకే ఆమె తన ప్రతిభ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. 2010 లో కరీంనగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ నెగ్గింది. కొద్దిరోజుల్లోనే ఆమె జాతీయ స్థాయిలో కూడా పలు టోర్నీలలో పతకాలు నెగ్గింది. తర్వాత ఆమె.. విశాఖపట్నంలోని ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐవీ రావు దగ్గర శిక్షణ తీసుకుంది. 2010లోనే ఈరోడ్ (తమిళనాడు) లో జరిగిన నేషనల్ ఛాంపియన్స్ లో ‘గోల్డెన్ బెస్ట్ బాక్సర్’ అవార్డు పొందింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Boxing, Commonwealth Game 2022, Nikhat Zareen, PM Narendra Modi