Home /News /telangana /

PRIME MINISTER NARENDRA MODI COMING TO HYDERABAD TODAY WILL INAUGURATE RAMANUJACHARYULU STATUE AND PARTICIPATE IN ICRISAT PROGRAM AK

PM Modi Hyderabad Visit: నేడు హైదరాబాద్ రానున్న ప్రధాని మోదీ.. రామానుజాచార్యుల విగ్రహం ఆవిష్కరణ.. భారీ భద్రతా ఏర్పాట్లు

ప్రధాని మోదీ, రామానుజచార్యుల విగ్రహం

ప్రధాని మోదీ, రామానుజచార్యుల విగ్రహం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులుసహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననుండటంతో భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

  నేడు ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ రానున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌‌ మండలం ముచ్చింతల్‌‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. 216 అడుగుల సమతా మూర్తి విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించనున్నారు. దీంతో పాటు సంగారెడ్డి జిల్లా పటాన్‌‌చెరులోని అంతర్జాతీయ మెట్టప్రాంత పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్‌‌) స్వర్ణోత్సవాలకు ప్రధాని హాజరుకానున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ భద్రత కోసం కేంద్ర బలగాలతో పాటు పాటు 8 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి మధ్యాహ్నం 2.10 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి 2.45 గంటలకు హెలికాప్టర్ లో సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులోని ఇక్రిశాట్‌కు వెళతారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో పాల్గొని ఇక్రిశాట్కొత్త లోగోను ఆవిష్కరిస్తారు.

  అక్కడ కొత్తగా ఏర్పాటు చేసిన పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రంతో పాటు ర్యాపిడ్‌‌ జనరేషన్‌‌ అడ్వాన్స్‌‌మెంట్‌‌ ఫెసిలిటీని ఆయన ప్రారంభిస్తారు. 4.15 గంటల వరకు ఇక్రిశాట్లో ఉండి అక్కడి నుంచి మళ్లీ హెలికాప్టర్లో శంషాబాద్ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని చిన్న జీయర్ ఆశ్రమానికి చేరుకుంటారు. అక్కడ సమతా మూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. రాత్రి 8 గంటల వరకు రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. రాత్రి 8.-40 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్తారు.

  ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులుసహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననుండటంతో భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ బలగాలు ఇప్పటికే ముచ్చింతల్ గ్రామం పరిసర ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నాయి.

  Telangana Politics: తెలంగాణ బీజేపీకి ప్రశాంత్ కిశోర్ గండం ?.. ఆ సీన్ మళ్లీ రిపీట్ అవుతుందా ?

  CM KCR : ముచ్చింతల్‌లో సీఎం కేసీఆర్, సమతా మూర్తి విగ్రహ స్థాపనపై ఎమన్నారంటే..

  ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రెండు వేదికల వద్ద పెద్ద ఎత్తున పోలీసు సిబ్బందిని మోహరించారు. వాటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లపై సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు శుక్రవారం పరిశీలించారు. ప్రధాని, రాష్ట్రపతి పర్యటన రోజుల్లో ముచ్చింతల్ ఆశ్రమానికి సాధారణ ప్రజలకు అనుమతిలేదని, ప్రత్యేక పాస్లు ఉన్న వారిని మాత్రమే అనుమతించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Hyderabad, PM Narendra Modi

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు