హోమ్ /వార్తలు /తెలంగాణ /

Digital Marriage: పెళ్లి మంత్రం.. డిజిటల్ మయం.. ఆన్ లైన్ లోనే వ్రతాలు, పెళ్లిళ్ల మంత్రాలు..

Digital Marriage: పెళ్లి మంత్రం.. డిజిటల్ మయం.. ఆన్ లైన్ లోనే వ్రతాలు, పెళ్లిళ్ల మంత్రాలు..

Digital Marriage: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శుభ-అశుభ కార్యక్రమాలు నిర్వహించే పూజారులు కొత్త ప‌ద్ద‌తుల‌ను ఆవ‌లంభిస్తున్నారు. వీడియో కాల్, ఆన్ లైన్ తదితర టెక్నాలజీ ని ఉపయోగిస్తూ ఉన్న దగ్గరే మంత్రాలు చదువుతూ వ్రతాలూ, పెళ్లిళ్లు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ పురోహితుడు ఇప్ప‌టికే రెండు వ్ర‌తాలు, ఓ పెళ్లి చేశారు.

ఇంకా చదవండి ...

  (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  క‌రోనా మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా గ‌త సంవ‌త్స‌ర కాలంగా ఆన్ లైన్ లోనే ఉద్యోగులు వారి విధులు నిర్వ‌హిస్తున్నారు. విద్యార్థులు డిజిటల్ పాఠాలు వింటున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అందరూ ఇంటి నుంచే ప‌ని చేస్తున్నారు. అంతా డిజిటల్ మయం అయిపోయింది. ఎక్కడ చూసినా టెక్నాలజీని విపరీతంగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అది పెళ్లిళ్లకు కూడా పాకింది. ఎవరు వచ్చినా రాకున్నా పెళ్లిలో పంతులు లేనిది పెళ్లి జరగదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పంతులు లేకపోయినా జరిపిస్తున్నారు. కాకపోతే ఆన్ లైన్ లో అతడు మంత్రాలు చదువుతుండగా ఇక్కడ పెళ్లి తంతు ముగిస్తున్నారు. పూర్తి వివరాలు.. పూరోహితుల‌కు పౌరాహిత్యం త‌ప్ప వేరే ప‌ని వారికి రాదు. దీంతో పూజలు, వ్ర‌తాలు, పెళ్లిళ్లు పేరంటాలు ఎలా చేయాల‌ని ఆలోచించారు.. పెళ్లిలు, పేరంటాల‌కు వెళ్లితే క‌రోనా వ‌చ్చే ప‌రిస్థితి ఉంది. దీంతో ఓ పండితుడు త‌న పౌర‌హిత్యాన్ని కొన‌సాగించేందుకు అత‌ను ఓ ఆలోచ‌న చేశాడు. ఆన్ లైన్ లో మంత్రాలు చెప్పి వ్రతాలు, పెళ్లిళ్లు చేయవచ్చని నిరూపించాడు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో పూజారులు ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా శుభ, అశుభ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

  మండల కేంద్రానికి చెందిన పూజారి బావి శరత్ చంద్ర శర్మ ఆన్లైన్ వీడియో కాల్ ద్వారా రెండు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడంతోపాటు ఒక పెళ్లిని జరిపించాడు. వీడియోకాల్ ద్వారానే మంత్రాలను చదువుతూ వధూవరులు చేయవలసిన పనులను చెబుతూ పెండ్లి జరిపించాడు. అంతేకాకుండా వీడియోకాల్ ద్వారానే సత్యనారాయణ స్వామి వ్రతాలు సైతం జరిపించాడు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తాము ఇలా వీడియో కాల్ ద్వారా పూజలు, పెళ్లిళ్లు జరిపిస్తున్నట్లు పూజారి బావి శరత్ చంద్ర శర్మ చెప్పారు. దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. కరోనా మహమ్మారి బారినపడకుండా వీడియో కాల్ ద్వారా శుభకార్యాలు చేయడం శ్రేయస్కరమన్నారు.

  మ‌రోవైపు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో నివాసముండే గురు రేణుక, వినయ్ గురుస్వామి ఆధ్వర్యంలో క‌రోనా అంతం కావాల‌ని ప్రత్యేక యజ్ఞం, హోమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కరోనా మహమ్మారిని నాషనం చేసి ప్ర‌జ‌లంద‌రిని ఆ భగవంతుడే కాపాడ‌ల‌ని యజ్ఞం చేశామ‌న్నారు. ఈ నెల 29 నుంచి పెళ్లి ముహూర్తాలు ఉన్నందున పూజారులు అంద‌రు అన్ లైన్ లో పెళ్లిలు, పూజ‌లు, వ్ర‌తాలు చేయాల‌ని విన‌య్ గురు స్వామి చెప్పారు. ఉన్న టెక్నాల‌జీని వాడుకొని పౌరాహిత్యం కొన‌సాగించాల‌ని వివ‌రించారు.

  First published:

  Tags: Digital mantras, Digital marriages, Kamareddy, Nizamabad, Telangana, Wedding online

  ఉత్తమ కథలు