• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • PRIEST FROM ADILABAD DISTRICT PERFORM POOJA WEARING HELMET PHOTO BECOME VIRAL AK ABD

Adilabad: ఈ పూజారి ఐడియా సూపర్.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు..

హెల్మెట్ పెట్టుకుని పూజలు చేస్తున్న పూజారి

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ఓ పూజారి వాహనం నడిపేటప్పుడే కాదు, వృత్తి ధర్నాన్ని నిర్వర్తించేటపుడు కూడా హెల్మెట్‌ను వీడటం లేదు.

  • Share this:
    ద్విచక్ర వాహనదారులు ప్రయాణంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నది నిబంధన. ఈ నిబంధన పాటించనివారికి జరిమానాలు కూడా విధిస్తున్నారు. అయినా హెల్మెట్ అంటే కొందరు అయిష్టత చూపుతున్నారు. కానీ ఆ హెల్మెట్ ఇపుడు కరోనా సమయంలో రక్షణ కవచంలా పనిచేస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో ఓ పూజారి వాహనం నడిపేటప్పుడే కాదు, వృత్తి ధర్నాన్ని నిర్వర్తించేటపుడు కూడా హెల్మెట్‌ను వీడటం లేదు. ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మధ్య డబుల్ మాస్కులు ధరిస్తున్నారు. మరికొందరు ఎక్కడికి వెళ్ళినా శానిటైజర్ ను వెంటా తీసుకెళుతూ తరుచు చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటున్నారు.

    ఈ పరిస్థితుల్లో బోథ్ మండల కేంద్రంలో ఓ షాపు ప్రారంభం సందర్భంగా పూజలు చేయడానికి వచ్చిన పూజారి ఏకంగా హెల్మెట్ పెట్టుకొని పూజలు నిర్వహించడం విస్మయపరిచింది. తొలుతా అందరు ఆశ్చర్యం వ్యక్తం చేసినా కరోనా నేపథ్యంలో ఇంత శ్రద్దగా జాగ్రత్తలు తీసుకోవడం చూసి బాగుందని మెచ్చుకుంటున్నారు. కాగా వేగంగా విస్తర్తిస్తున్న కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఇపుడు లాక్ డౌన్ అమలు చేస్తోంది. కానీ బోథ్ మండల కేంద్రంలోఅంతకు ముందు నుంచే స్వచ్చందంగా లాక్ డౌన్ అమలు చేసుకుంటున్నారు గ్రామస్తులు.
    Published by:Kishore Akkaladevi
    First published: