Video Call Marriage: పెళ్లి ముహూర్తం టైంకి కరోనాతో గ్రామస్తుడు మృతి.. ఆన్‌లోనే మంత్రాలు చదివి పెళ్లి జరిపించిన పురోహితులు

ఆన్ లైన్ లో మంత్రాలు చదువుతుండగా పెళ్లి చేసుకుంటున్న వధూవరులు (Image credit : youtuebe)

Video Call Marriage: కక్కు వచ్చినా.. కళ్యాణం వచ్చినా ఆగదు అంటారు.. కానీ కరోనా వైరస్ జరుగుతున్న పెళ్లిని ఆపే ప్రయత్నం చేసింది. పెళ్లి జరుగుతున్న సమయంలో కరోనాతో ఒకరు చనిపోగా.. పెళ్లి జరిపించాల్సిన పండితుడు అక్కడకు వచ్చేందుకు ధైర్యం చేయలేదు.. దీంతో పెళ్లి తంతు అంతా వాట్సాప్ వీడియో కాల్ లోనే జరిపించాడు.

  • Share this:
    కరోనా కారణంగా చాలా మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. మరి కొంత మంది తక్కువ మందితో వివాహం జరిపించుకుంటున్నారు. అయితే పెళ్లి జరిగే గ్రామంలో కరోనాతో గ్రామస్తుడు ఒకరు మృతి చెందాడు. ఆ సమయంలో పెళ్లి జరిపించాల్సిన పండితుడికి ఆ విషయం తెలిసింది. అతడు భయపడిపోయి తను పెళ్లికి రాలేనని తేల్చి చెప్పేశాడు. పెళ్లి ముహూర్తం దగ్గర పరడుతుంది.. ఈ సమయంలో అలా చేయడం కరెక్డ్ కాదని వధూవరుల తల్లిదండ్రులు పండితుడిని వేడుకున్నారు. దీంతో పండితుడు తను వాట్సప్ వీడియో కాల్ ద్వారా మంత్రాలు చదువుతానని చెప్పడంతో వారు ఒప్పుకున్నారు. దీంతో పండితుడు వాట్సాప్ వీడియో కాల్‌లో మంత్రాలు చ‌ద‌వ‌గా.. పెళ్లి మండ‌పంలో నూత‌న వ‌ధూవ‌రులు ఒక్క‌ట‌య్యారు. ఈ సంఘ‌ట‌న మెద‌క్ జిల్లాలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా టేక్మాల్ మండ‌లానికి చెందిన పాల్వోత్ మోహ‌న్‌కు పాప‌న్న‌పేట మండ‌లం సోమ్లా తండాకు చెందిన బానోత్ మంజుల‌కు వివాహం కుదిరింది. నిర్ణయించుకున్న పెళ్లి ముహుర్తానికి పెళ్లి జరగనుండగా ఆ గ్రామంలో కరోనా వైరస్ పెళ్లికి తంటాలు తీసుకొచ్చింది.

    ముహుర్తం స‌మ‌యానికి వ‌రుడి ఇంటికి స‌మీపంలో ఓ క‌రోనా బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆనోట.. ఈ నోట ఈ విషయం పండతుడికి తెలిసింది. అతడు పెళ్లి మండపానికి రావడానికి ధైర్యం చాలలేదు. వారికి ఫోన్ చేసి తను రాలేనని తెగేసి చెప్పేశాడు. దీంతో వ‌ధూవ‌రుల త‌ల్లిదండ్రులు ఆందోళ‌న‌కు గుర‌య్యారు.

    ఎలాగైనా పెళ్లి జ‌రిపించాల‌ని పండితుడిని వేడుకోవ‌డంతో.. ఆన్‌లైన్‌లో మంత్రాలు చ‌దివి పెళ్లి చేస్తాన‌ని ఆఫ‌ర్ ఇవ్వ‌డంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి వాట్సాప్ వీడియో కాల్‌లో పండితుడు మంత్రాలు చ‌ద‌వ‌గా, మండ‌పంలో వరుడు వ‌ధువుకు తాళిక‌ట్టి, దండ‌లు మార్చుకున్నారు. పెళ్లి విజ‌య‌వంతంగా ముగిసింది.
    Published by:Veera Babu
    First published: