PRESIDENT KOVIND VICE PRESIDENT VENKAIAH NAIDU CJI RAMANA AND CHANDRABABU NAIDU WISHED TELANGANA CHIEF MINISTER KCR A HAPPY BIRTHDAY PRV
CM KCR Birthday: నేడు తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, చంద్రబాబు
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (CM KCR) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు (CM KCR) గురువారంతో (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR Birthday)కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫోన్ చేసి శుభాంక్షలు తెలిపారు. రాష్ట్రపతితోపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌కు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైతం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి (@TelanganaCMO) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు సదా ఆనంద ఆరోగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు,
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను”అని ఆకాక్షించారు.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారు,
మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.@TelanganaCMOpic.twitter.com/MXUlXKi0Fj
మంత్రి హరీశ్ కూడా కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణ తలరాత మారింది, ఆయన నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకెళ్తోందన్న మంత్రి హరీష్ రావు సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ జన్మదినం తెలంగాణకు పండుగరోజన్న హరీష్.. కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలంటూ ట్వీట్ చేశారు.
కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు . టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత అమ్మవారికి బంగారు ఆభరణాలు సమర్పించారు.
ఇక వైసీపీ ఎంపీ Vijay Sai Reddy కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దీర్ఘకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.