Home /News /telangana /

దారుణం.. పీహెచ్‌సీకి తాళం వేయడంతోనే రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

దారుణం.. పీహెచ్‌సీకి తాళం వేయడంతోనే రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పీహెచ్‌సీకి తాళం వేసి ఉండడంతో నొప్పులు తట్టుకోలేక ఆస్పత్రి గేటుముందే పడిగాపులు కాశారు. దాదాపు రెండు గంటల పాటు పురిటి నొప్పులతో అల్లాడి.. రోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

    ఓ గర్భిణీ పురిటి నొప్పులతో పీహెచ్‌సీకి వస్తే గేటుకు తాళం వేసి ఉంది. దాదాపు రెండు గంటల పాటు పీహెచ్‌సీ గేటు ముందే పడిగాపులుకాసి.. రోడ్డుపైనే ప్రసవించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సాగర్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ రోజువారీ కూలీ భార్య శాంత్రాదేవి గర్భిణీ. శనివారం ఉదయం పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ప్రైవేటు వాహనంలో మఠంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. కాగా పీహెచ్‌సీకి తాళం వేసి ఉండడంతో నొప్పులు తట్టుకోలేక ఆస్పత్రి గేటుముందే పడిగాపులు కాశారు.

    దాదాపు రెండు గంటల పాటు పురిటి నొప్పులతో అల్లాడి.. రోడ్డుపైనే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం పీహెచ్‌సీ సిబ్బంది చేరుకుని ఆమెను మెరుగైన వైద్య చికిత్స కోసం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ చంద్రశేఖర్ స్పందిస్తూ ఈ విషయం నా దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తానని పేర్కొన్నారు.
    Published by:Narsimha Badhini
    First published:

    Tags: Pregnant, Suryapet, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు