• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • PREGNANT WOMAN DIED EIGHT HOURS AFTER IN ROAD ACCIDENT NARAYANGUDA FULL DETAILS HERE HSN

ఏడాది వయసున్న బాబు.. మరోసారి గర్భందాల్చిన భార్య.. ఆస్పత్రిలో చెకప్ చేయించి బైక్ పై ఇంటికి తీసుకెళ్తోంటే..

ఏడాది వయసున్న బాబు.. మరోసారి గర్భందాల్చిన భార్య.. ఆస్పత్రిలో చెకప్ చేయించి బైక్ పై ఇంటికి తీసుకెళ్తోంటే..

సంతోష్ గౌడ్, శాలినీ దంపతులు

భర్తతో కలిసి ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నారు. ఏమేం మందులు వాడాలో అన్నీ కొనుక్కుని భర్తతో బైక్ పై తిరుగు ప్రయాణం అయింది. కానీ విధి ఆమె పాలిట యమపాశమయింది. ఆర్టీసీ బస్సు రూపంలో ఆమెను మృత్యువు వెంటాడింది.

  • Share this:
    కొన్నాళ్ల  క్రితం వాళ్లిద్దరికీ పెళ్లయింది. వారి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడు. ఇంతలోనే ఆమె తన భర్తకు ఓ శుభవార్తను చెప్పింది. మళ్లీ తల్లినయ్యానన్న వార్తతో ముఖంలో సంతోషం కనిపించింది. భర్తతో కలిసి ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నారు. ఏమేం మందులు వాడాలో అన్నీ కొనుక్కుని భర్తతో బైక్ పై తిరుగు ప్రయాణం అయింది. కానీ విధి ఆమె పాలిట యమపాశమయింది. ఆర్టీసీ బస్సు రూపంలో ఆమెను మృత్యువు వెంటాడింది. ఆమె పొట్ట మీదు నుంచే ఆర్టీసీ బస్సు చక్రాలు వెళ్లడంతో విలవిలలాడిపోయింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    ముషీరాబాద్ బాకారంలో సంతోష్ గౌడ్(36), శాలినీ(35) దంపతులకు ఏడాది వయసున్న కొడుకు ఉన్నాడు. శాలినీ ఇటీవలే మళ్లీ గర్భవతి అయింది. సంతోషంగా తన భర్తకు ఆ వార్తను తెలిపింది. దీంతో వాళ్లిద్దరూ బుధవారం బాబును ఇంట్లో పెద్దవాళ్ల దగ్గర ఉంచి ఆసుపత్రికి చెకప్ కోసం వెళ్లారు. హైదర్ గూడలోని ఫెర్నాండెజ్ ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించుకున్నారు. ఆ తర్వాత కావాల్సిన మందులు కొనుక్కుని భర్తతో కలిసి శాలిని బైక్ పై తిరుగు ప్రయాణమయింది. నారాయణగూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్దకు బుధవారం ఉదయం 9.45 గంటల సమయంలో చేరుకున్నారు. సిగ్నల్ పడగానే సంతోష్ కూడా తన బైక్ ను స్టార్ట్ చేశాడు. అయితే ముషీరాబాద్ డిపోకు చెందిన ఓ బస్సు వారి పక్కగా వచ్చి వాళ్లు వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది.
    ఇది కూడా చదవండి: గురువారం వచ్చిందంటే చాలు ఆ ఊళ్లో టెన్షన్ టెన్షన్.. దెయ్యం భయంతో ఇళ్లన్నీ ఖాళీ.. అసలు అక్కడ ఏం జరుగుతోందంటే..

    దీంతో ఆ వాహనంపై ఉన్న సంతోష్, శాలినీ పడిపోయారు. శాలిని పొట్ట మీద నుంచే బస్సు వెనక చక్రాలు వెళ్లిపోయాయి. ఈ ఘటనలో సంతోష్ కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. శాలిని పొట్ట భాగం నుజ్జు నుజ్జయింది. ఆ దారి అంతా రక్తం పారి ఎర్రగా మారిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మల్లన్న ఆమెకు ప్రాథమిక చికిత్స చేశాడు. వెంటనే అటుగా వచ్చిన అంబులెన్స్ ను ఆపి భార్యాభర్తలను ఆసుపత్రికి తరలించారు. హైదర్ గూడా అపోలో ఆస్పత్రిలో వారిద్దరినీ చేర్చారు. అయితే దాదాపు ఎనిమిది గంటల పాటు శాలిని మృత్యువుతో పోరాడింది. చివరకు బుధవారం రాత్రి ఆమె మరణించింది. భర్త కూడా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. బస్సు రూపంలో ఓ గర్భిణి మృత్యువాత పడటం అందరినీ కలచివేస్తోంది. ఏడాది వయసున్న బాబు పరిస్థితిని గురించి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
    ఇది కూడా చదవండి: గుంటూరులో డిగ్రీ విద్యార్థిని హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు.. చాటింగ్ లో ఆ మెసేజ్ ల వల్లే దారుణం..!
    Published by:Hasaan Kandula
    First published: