Adilabad : నన్ను దేవుడే కాపాడతాడు..! ఆసుపత్రికి వెళ్లను.. నిండు గర్భిణి వింత, కారణం ఇదేనట..!

Pregnant woman

Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో ఓ నిండు గర్భిణి వింత వాదన చేస్తోంది. హైబీపీ ఉన్న ఆమె వైద్యం కోసం ఏ ఆస్పత్రికి రానని ష్మించుకు కూర్చుంది. తనను ఏ డాక్టర్ కాపాడలేడు, తాను మొక్కుకున్న దేవుడే రక్షిస్తాడని అంటుంది.

  • Share this:
    ఆదిలాబాద్ (Aadilabad) జిల్లాలోని మారుమూల ప్రాంతల గిరిజనులు, ఆదివాసి ప్రాంతాలకు చెందిన గర్భిణి మహిళలు ఇటివల అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక వర్షాలతో(Rains) సరైన సమయంలో వాగులు, వంకలు దాటలేక అవస్థలు పడడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. దీనికి తోడు జిల్లా ఆసుపత్రిలో(Hospital) కూడా సరైన వైద్యులు లేక గర్భిణిలతోపాటు (Pregnant woman) గర్భంలోనే పిల్లలు సైతం చనిపోతున్న సంఘటనలు వెలుగు చూశాయి.

    ఆదిలాబాద్‌లో గర్భిణిల అవస్థలు

    దీంతో జిల్లా కలెక్టర్(Collector ) తాజా పరిణామాలపై సరియస్ అయ్యారు. స్థానికంగా ఉండే వైద్యులు గర్భిణిలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడంతో పాటు సరైన సమంలో వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే రిమ్స్‌లో (RIMS)వెలుగు చూస్తున్న సంఘటనలపై వైద్య అధికారుల తీరుపై అమె మండిపడ్డారు. నేరుగా గిరిజన గూడాల్లోని మహిళలను వెళ్లి ఆమె పరామర్శించారు. దీంతో స్థానిక వైద్య అధికారులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు గిరిజన గూడాలకు అందుబాటులో ఉంటూ గర్భిణి స్త్రీలకు వైద్యం అందిస్తున్నారు.

    ఇది చదవండి : ఆదిలాబాద్‌‌ను వీడని వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణిలు అవస్థలు పడాల్సిందేనా...?


    ఆసుపత్రికి వెళ్లనంటున్న గర్భిణి

    అయితే హైబీపితో ఇబ్బంది పడుతున్న ఓ గర్భిణి మహిళలకు వైద్యం అందించేందుకు వెళ్లిన వారికి ఆ గర్భిణి చుక్కలు చూపిస్తోంది. వివరాల్లోకి వెళితే ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలానికి చెందిన మహాగావ్ గ్రామానికి చెందిన రేఖాబాయి అనే గిరిజన మహిళ ఎనిమిది నెలల గర్భవతి.(pregnant ) గతంలో హైబీపీ వల్ల రెండు సార్లు గర్భ స్రావం అయింది. తాజాగా ఆమెను స్థానిక ఉట్నూరు పీహెసీలో పరీక్షించేందుకు స్థానిక ఆశా కార్యకర్త తీసుకుని వెళ్లారు.దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు గతంలో రెండు సార్లు అబార్షన్ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆదీలాబాద్ రిమ్స్‌కు తరలించమని సూచించారు.

    ఇది చదవండి : దళిత బంధు సర్వే.. కింద కూర్చోని ఏం చేయాలో చెప్పిన కలెక్టర్


    ఎమ్మార్వో వచ్చిన గర్భిణి వినలేదు..

    అయితే రేణుక భాయి రిమ్స్‌కు వెళ్లెందుకు నిరాకరించింది. "తాను ఆస్పత్రికి రాను , దేవుడిని మొక్కుకున్న నన్ను దేవుడే రక్షిస్తాడని చెప్పింది".దీంతో స్థానిక సూపర్ వైజర్లు సైతం ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కూడా ఆమె వినకపోవడంతో మండల ఎమ్మార్వోకు సమాచారం అందించారు. దీంతో గూడానికి చేరుకున్న ఎమ్మార్వో(MRO) లక్ష్మణ్ ఆమెకు గోండు బాషలో వివరించారు. ఆస్పత్రికి వెళ్లకపోతే వచ్చే అనార్థాలను ఆయన వివరించినా.. ఆమె మాత్రం దేవుడినే నమ్ముకున్నానంటూ మొండికేసింది. దీంతో అధికారుల ఒత్తిడి ఎక్కువవుతుండడంతో తన ఇంటి నుండి పక్కింటికి వెళ్లిపోయింది. చివరికి చాలా మంది చెప్పిన తర్వాత కనీసం మండల కేంద్రంలోని ఆసుపత్రికి వెళ్లేందుకు అంగీకరించింది. దీంతో ఆమె వెంట డిప్యూటి తహసీల్దార్‌తో పాటు ఇతర రెవెన్యు అధికారులు ఆమె వెంట ఉండి మండల ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు.
    Published by:yveerash yveerash
    First published: