Home /News /telangana /

PREGNANT TRIBS WOMEN GIVE BIRTH ON ROADS AND STREAMS IN THE MIDDLE OF THE ROAD DUE TO THE LACK OF PROPER TRANSPORT FACILITIES IN ADILABAD ADB PRV

Tribes problems: ఆదిలాబాద్​లో ఆదివాసీలకు తప్పని వెతలు.. మొన్న వాగు ఒడ్డున.. నిన్న రోడ్డు మీద..

రోడ్డుపై గర్భిణీ

రోడ్డుపై గర్భిణీ

వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో మారుమూల గిరిజన గూడాలకు చెందిన ఆదివాసీ మహిళలు ప్రసవ వేదనకు గురవుతున్నారు.

    తన కడుపులో నవ మాసాలు పెరిగిన శిశువు ఈ భూమి మీదకు రావాలంటే గిరిజన మహిళల పాలిట ఓ గండంగానే పరిణించింది. పురిటి నొప్పులను సైతం పంటి బిగువున భరించినప్పటికి ప్రసవ వేదన మాత్రం వారికి తీవ్ర భారంగా మారుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని మారుమూల గిరిజన గూడాలకు చెందిన ఆదివాసి మహిళలకు ఏళ్లు గడుస్తున్న ప్రసవ వేదన తప్పడం లేదు. ప్రసవ సమయానికి ముందే మహిళలను గుర్తించి సమీపంలోని ఆసుపత్రులకు చేరవేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నప్పటికి ఈ వర్షా కాలంలో మారుమూల గిరిజన మహిళలకు (Tribes Women) ప్రసవ సమయంలో వేదన తప్పడం లేదు. వర్షాలు (Rains), వరదల (Floods) కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆసుపత్రులకు వెళ్ళెందుకు తిప్పలు తప్పడం లేదు. గూడాలకు సరైన రవాణ సౌకర్యం లేక, అంబులెన్స్ సహా ఇతర వాహనాలు వచ్చే పరిస్థితి లేక (No Proper Transport facility) పురిటి నొప్పులతో బయలుదేరిన మహిళలు మార్గం మధ్యలోనే ప్రసవించిన ఘటనలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పునరావృతమవుతున్నాయి. మొన్నటికి మొన్న పురిటి నొప్పులతో ఆసుపత్రికి బయలు దేరిన గిరిజన మహిళ (Woman) వాగు దేటే క్రమంలో వాగు ఒడ్డునే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక నిన్నటికి నిన్న ఓ మహిళ రోడ్డు పైనే ప్రసవించింది.

    ఆటోలో వంతెన వరకు..

    కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత నది వరద కారణంగా గ్రామం నుండి ఆసుపత్రికి చేరుకోలేక  ఓ మహిళ రోడ్డుపైనే ప్రసవించింది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం నాగేపల్లి గ్రామానికి చెందిన కొడిపె మల్లుబాయికి పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు 108కు సమాచారం ఇచ్చారు. అయితే వరద కారణంగా 108 వాహనం చేరుకునే పరిస్థితి లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆటోలో వంతెన వరకు తీసుకువెళ్ళారు. వంతెన వద్ద రోడ్డుకు కోతకు గురికావడంతో ముందుకు వెళ్ళలేకపోయారు. అక్కడె నిలిచిపోవడంతో 108 సిబ్బంది కాలినడక వెళ్ళి అక్కడే వైద్యం అందించడంతో మల్లుబాయి మగశిశువుకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా ఆరోగ్యం ఉన్నట్లు సిబ్బంది పేర్కొన్నారు.



    అనంతరం వారిని బెజ్జూరు మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు.  ఇలాంటి ఘటనలు పలుమార్లు పునరావృతమవుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అవసరమైన చర్యలు తీసుకొని ఈ ప్రసవ వేధనను తప్పించాలని ఈ ప్రాంత గిరిజనులు కోరుతున్నారు.

    వాగు ఒడ్డునే..

    ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్ పంచాయతీ పరిధిలోని మామిడిగూడ(జి) గ్రామానికి చెందిన గర్భిణి ఉయిక గాంధారి వాగు దగ్గర ప్రసవించింది. ఉదయం ఆమె పురిటి నొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అప్రమత్తమై.. ఆమెను ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మామిడిగూడ వాగు ఉద్ధృతి పెరిగింది. వాగు దాటేందుకు ఇబ్బంది ఎదురైంది. నొప్పులు తీవ్రం కావడంతో గర్భిణి ఆ వాగు ఒడ్డునే ప్రసవించింది. విషయం తెలుసుకున్న పిట్టబొంగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది వాగు దాటి వెళ్ళి అక్కడే ప్రథమ చికిత్స అందించారు.

    అనంతరం  గ్రామస్థుల సహాయంతో ఆ బాలింతను, పసిబిడ్డను అతికష్టం మీదా వాగు దాటించారు. వాగు దాటాక అక్కడ నుండి బురదమయమైన రోడ్డు ఉండటంతో అంబులెన్స్ రాలేని పరిస్థితి.. దీంతో వాగు వద్ద నుండి ఒకటిన్నర కిలోమీటర్  మేర నడిపించుకుంటూ మామిడిగూడ(ఎ) గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఐటిడిఎ - అవ్వల్ అంబులెన్స్ లో ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్యులు ఆ తల్లి బిడ్డలకు వైద్యమందించారు.

    ప్రస్తుతం తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారు. కాగా మామిడిగూడ (జి) గ్రామస్తులకు ప్రతి ఏటా వర్షాకాలంలో వాగు వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉయిక గాంధారి బాయి భర్త ఉయిక బీర్షావ్ తెలిపారు. తన భార్య గాంధారి బాయి కి పురిటి నొప్పులు రావడంతో అక్కడి నుండి ఆసుపత్రికి వెళ్లాలంటే మామిడిగూడ వాగు ఉప్పొంగి ప్రవహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, ఈ సందర్బంలో వాగు వద్దే ఆమె ప్రసవించిందని.. ఆడ బిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. అప్పటికే సమాచారం అందించిన పిట్టబొంగరం వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని తల్లి బిడ్డలను పరీక్షించి వారిని వాగుదాటించి ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారని, ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని, వంతెన ఏర్పాటు చేయాలని బిర్షావ్ కోరారు.

    గర్భిణి వాగు ఒడ్డునే ప్రసవించిన విషయం తెలుసుకున్న ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆ తల్లి బిడ్డలను పరామర్శించి వారి ఆరోగ్య క్షేమాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న కెసిఆర్ కిట్ ను వారికి అందజేశారు.

    చైర్మన్ మాట్లాడుతూ.. ప్రసవాల కోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులు వాగులు వంకలు దాటుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, ప్రసవాల కోసం 15 రోజుల ముందే ఉట్నూరు ఆసుపత్రిలో ఉన్న ప్రత్యేక ప్రసూతి కేంద్రానికి చేరుకొని క్షేమంగా ప్రసవాలను చేసుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రసవాల పట్ల జాగ్రత్తపడాలన్నారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Adilabad, Pregnant, Tribes

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు