లాక్డౌన్ కాలంలో గర్భిణి మహిళలు చాల కష్టాలు ఎదుర్కొంటున్నారు.. కేవలం నాలుగు గంటలు మాత్రమే సడలింపు ఇచ్చిన నేపథ్యంలోనే ఆసుపత్రికి వచ్చిన వారు తిరిగి వెళ్లేందుకు నానా యాతన పడుతున్నారు.. లాక్డౌన్ సమయంలో ఎమర్జెన్సి మినహా ఏ వాహానాలను పోలీసులు అనుమతి ఇవ్వడం లేదు. దీంతో చాలమంది మహిళలు ఆసుపత్రులకు వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఇక పురుటి నొప్పులు ఎప్పుడస్తాయో తెలియని అయోమయ పరిస్థితిలో ఆసుపత్రులకు బయలుదేరుతున్న వారు , రవాణా సౌకర్యాలు లేక నానా పాట్లు పడుతున్నారు..ఇలా ఇటివల చాల మంది మహిళలు పోలీసుల కంటపడడంతో వారే స్వయంగా తమ వాహానాల్లో ఇంటికి లేదా ఆసుపత్రులకు తీసుకెళ్లి దిగబెడుతున్నారు.ఇలా రాష్ట్రంలో రోజు ఎక్కడో ఓ చోట గర్భిణి మహిళలు వాహనాలు లేక ఇబ్బందులు ఎదుర్కోంటున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి...తాజాగా పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న ఓ గర్భిణిని గోపాలపురం పోలీసులు తమ వాహనంలో కోఠి ప్రసూతి ఆస్పత్రిలో చేర్పించి తమ ఉదారత చాటుకున్నారు.
వివరాల్లోకి వెళితే...సికింద్రాబాద్ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన సంగెం స్వాతి పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లేందుకు వాహనం కోసం రోడ్డుపైకి వచ్చింది. ఎంతసేపటికి వాహనం దొరకకపోవడం వల్ల ఆమె తల్లి సమీపంలోని చెక్‌పోస్టు వద్దకు వెళ్లి పోలీసుల సాయం కోరింది. వెంటనే స్పందించిన గోపాలపురం ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్.. గర్భిణిని, ఆమె తల్లిని వాహనంలో కూర్చోబెట్టి, కానిస్టేబుల్, హోంగార్డులను వారి వెంట పంపారు. కోఠిలోని ప్రసూతి ఆస్పత్రిలో ఆమెను చేర్పించారు.
కరోనా కాలంలో గర్భిణిలు చాల ఇబ్బందులు పడుతూ...ముఖ్యంగా లాక్డౌన్ నేపథ్యంలోనే ఇటివల తెలంగాణలో ఓ నిండు గర్భిణి డాక్టర్ల నిర్లక్ష్యంతో ప్రాణాలు వదిలింది.. మరోవైపు ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు పురుడు పోసుకోకముందే మృత్యువాతపడ్డారు. భవితరాలకు జన్మనిచ్చే అమ్మ పురుడు నోప్పులు ఎప్పుడు వస్తాయో తెలియని స్థితిలో రోడ్డెక్కుతుండడంతో ఒక్కోసారి దిక్కుతోచని స్థితిలోకి వెళుతున్నారు..చాలా వరకు ఎలాగోల తమ గమ్యస్థానాలకు చేరుతున్నా...కొన్ని సమయాల్లో మాత్రం ఈ కష్టాలు తప్పడం లేదు..దీంతో గర్భిణిలకు ప్రత్యేకంగా లాక్డౌన్ సమయంలో వాహన సౌకర్యం కల్పించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Lockdown, Pregnant women