Home /News /telangana /

PREGNANAT WOMAN SUICIDE BEFORE DELIVERY IN MANCHIRYAL VRY

Telangana News : అయ్యో పాపం .. కడుపులో ఉన్న శిశువు ఏం చేసిందమ్మా... నిండు గర్భిణి దారుణం..!

pregnant woman suicide

pregnant woman suicide

Telangana News : ఓ వైద్యుడు చేసిన నిర్వాకానికి తోడు ఇంట్లోని అత్తమామల వేధింపులు ఊహించిన ఓ నిండు గర్భిణి భయం చివరికి ఆమెతో పాటు కడుపులో ఉన్న శిశువును మింగింది.

    ఇంకా మగపిల్లల కోసం తాపత్రయపడుతున్నారనే సంఘటనకు ఉదహారణ ఓ నిండుగర్భిణి ఆత్మహత్య నిలిచింది. తొలికాన్పులో ఆడపిల్ల పుట్టిన తర్వాత రెండవ కాన్పులో కూడ ఆడపిల్ల పుడతారనే భయం ఆ తల్లిని తీవ్రంగా కలిచి వేసింది. అందుకు కారణం ఆఇంటిలోని తోటి మహిళ అయిన అత్త , మరోవైపు భర్తలు మరోసారి ఆడపిల్ల పుడితే తనకు వేధింపులు తప్పవని ఫీలయ్యింది. వారి భయంకరమైన మాటలను ఆమే ముందుగానే జీర్జించుకోలేక పోయింది. ముందు పుట్టిన ఆడపిల్ల విషయంలోనే ఎత్తిపొడుపు మాటలను ఆమె తట్టుకోలేక పోయింది. ఆధునిక జీవితంలో కూడా ఆడ, మగకు కారణం తాము కాదని తెలుసుకోలేక పోయింది. తన వంశం, భవిష్యత్ గురించే ఆలోచించింది తప్ప తాను ఏం చేస్తున్నానో ఆమె ఆలోచించ లేకపోయింది.

    ఈ క్రమంలో నిండు గర్భిని తనకు రెండవ సారి కూడా ఆడపిల్ల పుడుతుందని భావించి నిర్ధాక్షిణ్యంగా ఆత్మహత్య చేసుకుంది. మరో రెండు రోజుల్లో పురుడు పోసుకుంటుందనగా ఈ అఘాయిత్యానికి పాల్పడింది. ఇక విషాదమేమిటంటే ఆమె గర్భంలో ఉంది మగశిశువు. కాని ఆమె చనిపోయిన తర్వాత ఆ విషయం కుటుంబ సభ్యులకు మృత శిశువు దర్శనమిచ్చింది. తీవ్రంగా మహిళా సమాజాన్ని తీవ్రంగా కలిచి వేస్తున్న ఈ సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

    Omicron Alert : కమ్యూనిటిలోకి చేరింది.. రాజకీయా పార్టీలు వారి కార్యక్రమాలను రద్దు చేసుకొండి..!


    వివరాల్లోకి వెళితే..మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం నర్సాపూర్‌కు చెందిన పులిశెట్టి గంగన్న-శ్యామల రెండో కూతురు రమ్య (26)ను 2017లోమంచిర్యాలకు చెందిన ఎగ్గెన ఆనంద్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. వారికి రెండేళ్ల కూతురు ఆరాధ్య ఉంది. మరోవైపు 9 నెలల గర్భిణి అయిన రమ్యకు వైద్యులు గురువారం డెలివరీకి సమయం ఇచ్చారు. తెల్లవారితే కాన్పు ఉండడంతో మళ్లీ ఆడపిల్ల పుడితే ఇబ్బందులు తప్పవని భావించిన రమ్య బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

    సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రమ్య కడుపులో నుంచి మృతి చెందిన మగ శిశువును వైద్యులు వెలికితీశారు. ఆడపిల్ల పుడుతుందనుకొని ఆత్మహత్య చేసుకున్నదని, గర్భంలో మగబిడ్డ ఉన్నదని తెలిస్తే తమకు కడుపుకోత మిగిల్చేది కాదని తల్లిదండ్రులు బోరున విలపించారు.

    Palvancha Ramakrishna family suicide: టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే వనమా కుమారుడు అరెస్టు.. పాల్వంచ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో పోలీసుల చర్యలు


    అయితే ఇందుకు కారణం స్థానికంగా ఉండే ఓ వైద్యుడని కూడా తెలుస్తోంది. కడుపులో ఎవరున్నా వారికి ధైర్యం చెప్పి విషయాన్ని గుట్టుగా ఉంచాల్సిన వైద్యుడు మళ్లి ఆడపిల్లే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కాగా వైద్యుడు కూడా ఆమెకు ఆడపిల్ల పుడుతుందని చెప్పడంతో ఆమె మనోవేదనకు గురి కావడంతో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా కొంత ఆందోళన ఏర్పడడం ఆమె భరించలేక ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Manchiryala, Telangana, Woman suicide

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు