కేరళ వరద బాధితులకు ’ప్రకృతి నివాస్‘ సాయం

కేరళ వరద బాధితులకు వివిధ వర్గాలు బాసటగా నిలుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామానికి చెందిన ప్రకృతి నివాస్ అసోసియేషన్ కూడా అందులో ఒకటి.

news18-telugu
Updated: September 12, 2018, 8:47 PM IST
కేరళ వరద బాధితులకు ’ప్రకృతి నివాస్‘ సాయం
కేరళ వరద బాధితులకు వస్తువులు అందజేస్తున్న ‘ప్రకృతి నివాస్’ ప్రతినిధులు
news18-telugu
Updated: September 12, 2018, 8:47 PM IST
కేరళ వరద బాధితులకు ‘ప్రకృతి నివాస్’ సాయం అందించింది. 600 నివాసాలు ఉండే గేటెడ్ కమ్యూనిటీ వాసులు సుమారు రూ.6లక్షల విలువైన సామగ్రికి కేరళ వరద బాధితులకు అందించారు. సంగారెడ్డి జిల్లా అన్నారం గ్రామంలోని ప్రకృతి నివాస్ గేటెడ్ కమ్యూనిటీ వాసులు కేరళ వరద బాధితులను చూసి చలించారు. తమ వంతు సాయం చేయాలని భావించారు. అందులో భాగంగా.. తలోకొంత డబ్బు జమచేశారు. మూడు రోజుల్లోనే డబ్బు జమ చేసి.. ఆ తర్వాత వాటితో వస్తువులు కొనుగోలు చేశారు. కేరళలోని నెల్లిఅంపతి, నూరడి, పడగిరి గ్రామాల్లోని వరద బాధితులకు ఆ వస్తువులను అందజేశారు.

‘ప్రకృతి నివాస్’ అందించే సాయం కోసం వచ్చిన కేరళ వరద బాధితులు
‘ప్రకృతి నివాస్’ అందించే సాయం కోసం వచ్చిన కేరళ వరద బాధితులు

కేరళ వరద బాధితులకు వస్తువులు అందజేస్తున్న ‘ప్రకృతి నివాస్’ ప్రతినిధులు
కేరళ వరద బాధితులకు వస్తువులు అందజేస్తున్న ‘ప్రకృతి నివాస్’ ప్రతినిధులు

 సుమారు 2,375 కేజీల బియ్యం, 1,425 కేజీల గోధుమపిండి, 176 లీటర్ల ఆయిల్, మ్యాంగో ఫ్రూటీ 1,000 ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, చిన్నారులు, మహిళలు, పెద్దల కోసం కావాలసిన కొన్ని దుస్తులు, చెప్పులు, గ్లాసులు, ప్లేట్లు లాంటి కిచెన్ సామగ్రి, ప్లాస్టిక్ బక్కెట్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఫినాయిల్, సబ్బులు, పేస్టులు, బ్రష్‌లు లాంటివి అందించారు.

కేరళ వరద బాధితులకు అందించేందుకు తీసుకొచ్చిన వస్తువులు
కేరళ వరద బాధితులకు అందించేందుకు తీసుకొచ్చిన వస్తువులు

కేరళ వరద బాధితులకు వస్తువులు అందజేస్తున్న ‘ప్రకృతి నివాస్’ ప్రతినిధులు
కేరళ వరద బాధితులకు వస్తువులు అందజేస్తున్న ‘ప్రకృతి నివాస్’ ప్రతినిధులు
Loading...
ప్రకృతి నివాస్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు అన్నారం గ్రామ ఉప సర్పంచ్ కూడా సహకారం అందించారు. సుమారు 40 కుటుంబాలకు వస్తువులను అందజేశారు.

First published: September 12, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...