హోమ్ /వార్తలు /తెలంగాణ /

KA Paul America Visa: యువతకు కేఏ పాల్​ బంపర్​​ ఆఫర్​.. అమెరికా వెళ్లాలనుకునేవారికి ఉచితంగా వీసా..  

KA Paul America Visa: యువతకు కేఏ పాల్​ బంపర్​​ ఆఫర్​.. అమెరికా వెళ్లాలనుకునేవారికి ఉచితంగా వీసా..  

కేఏ పాల్​

కేఏ పాల్​

కేఏ పాల్​. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు. ఆయన ప్రసంగాలు ఎప్పుడూ సోషల్​ మీడియాలో ట్రెండింగ్​గా ఉంటాయి. అలాంటి పనే తాజాగా మరొకటి చేశారు. ఆయన చేసిన ప్రకటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్​ టాపిక్​గా మారిపోయింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కేఏ పాల్ (KA Paul)​. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Praja Shanti Party chief KA Paul ). ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్​ కూడా. ఒకప్పుడు ప్రపంచ దేశాధినేతలతో సమావేశాలు నిర్వహించిన ఆయనకు.. ఏపీ తెలంగాణలో మాత్రం ఆ ఆదరణ కనిపించదు. ఆయన చేసే కొన్ని పనులు, ఆయన ప్రసంగాలు ఎప్పుడూ సోషల్​ మీడియాలో ట్రెండింగ్​గా ఉంటాయి. అలాంటి పనే తాజాగా మరొకటి చేశారు. ఆయన చేసిన ప్రకటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్​ టాపిక్​గా మారిపోయింది.

మునుగోడు ఉప ఎన్నిక  (Munugodu By Elections)నేపథ్యంలో కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. మునుగోడు నిరుద్యోగ యువతకు బంపర్​ ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలిపారు. తన 59వ జన్మదినం (Birthday) సందర్భంగా మనుగోడు నియోజకవర్గంలోని 59మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి వారికి పాస్​పోర్టు (Passport), అమెరికా వీసా (America Visa)ఉచితంగా ఇప్పించనున్నట్లు తెలిపారు. మునుగోడు నిరుద్యోగ యువత తమ బయోడేటా తీసుకుని సెప్టెంబర్ 25న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్​కు రావాలని సూచించారు కేఏ పాల్​ .

తన 59వ పుట్టినరోజు కానుకగా వచ్చిన ప్రతి ఒక్కరిలో లాటరీ ద్వారా 59 మందిని ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్టు చేయించి, అమెరికా వీసా స్పాన్సర్ షిప్ చేయించి ఇస్తానని ప్రజాశాంతి పార్టీ చీఫ్ ప్రకటించారు. తన జన్మదిన కానుకగా అందిస్తున్న ఈ సదావకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని కోరారు పాల్​.

2019 ఎన్నిక‌ల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తానని హాడావిడి చేసిన కేఏ పాల్ త‌రువాత పోటీలోనే లేకుండా వెళ్లిపోయారు. అయితే తాజాగా మ‌ళ్లీ కేఏ పాల్ తెలంగాణ రాజ‌కీయ‌ల్లో ప్ర‌త్యక్ష‌మైయ్యారు (KA Paul entry in Telangana). తెలంగాణతోపాటు ఏపీలో కూడా కేసీఆర్ , జ‌గ‌న్ ముంద‌స్తుకు వెళతార‌ని ఉహాగానాలు ఉన్న నేప‌థ్యంలో కేఏ పాల్ తెలంగాణ రాజ‌కీయాల్లో (Telangana Politics) హాల్ చ‌ల్ చేస్తుండ‌టంతో ఇప్పుడు మ‌ళ్లీ కేఏ పాల్ చ‌ర్చ‌నీయాంశంగా మారారు.

కేఏ పాల్​కు చుక్కెదురు..

కేంద్రం ఎన్నిక ల సంఘం (Election Commission) వద్ద కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిస్టర్ అయ్యాయి. ఐతే ఇందులో చాలా పార్టీలు ఇప్పుడు యాక్టివ్‌గా లేవు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షాళన మొదలుపెట్టింది. క్రియాశీలంగా లేని పార్టీలపై వేటు వేస్తోంది. తాజాగా దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దుచేసింది. అంతేకాదు మనుగడలోని మరో 86 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. తెలంగాణ నుంచి రిజిస్టర్‌ అయిన 20 పార్టీలు ప్రస్తుతం క్రియాశీలకంగా లేవని చెప్పిన ఈసీ.. ఆయా పార్టీల గుర్తింపును రద్దు చేసింది. అందులో కేఎల్ పాల్‌ (KA Paul)కు చెందిన ప్రజాశాంతి పార్టీ (Prajashanti Party) కూడా ఉంది. యాక్టివ్‌గా లేని పార్టీలకు కామన్ సింబల్ నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.

First published:

Tags: America, Ka paul, Munugodu By Election, Visa

ఉత్తమ కథలు