Home /News /telangana /

PRABHAS REACHES GODAVARIKHANI FOR SALAAR MOVIE SHOOT SU

Prabhas: గోదావరిఖనిలో ప్రభాస్.. భారీ కాన్వాయ్ రచ్చ మాములుగా లేదుగా.. సలార్ సెట్ విజువల్స్..

గోదావరిఖనిలో ప్రభాస్..

గోదావరిఖనిలో ప్రభాస్..

Prabhas In Godavarikhani: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ పాన్ ఇండియా చిత్రం `సలార్`. రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో ఈ చిత్రంలోని కొన్ని సీన్లను చిత్రీకరించనున్నారు.

ఇంకా చదవండి ...
  యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ పాన్ ఇండియా చిత్రం `సలార్`. రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో ఈ చిత్రంలోని కొన్ని సీన్లను చిత్రీకరించనున్నారు. ఆర్జీ-3 పరిధిలో ఓసీపీ-2లో షూటింగ్‌ జరుపుకుంటోంది. సెట్ నిర్మాణ పనులు పూర్తవ్వడంతో ప్రభాస్ అర్ధరాత్రి రామగుండం ప్రాంతానికి చేరుకున్నారు. ఇక్కడ పది రోజుల పాటు షూటింగ్‌ జరగనుందని తెలుస్తోంది. ఈ క్రమంలో రామగుండంకు వచ్చిన ఆయన సీపీ సత్యనారాయణని కలిశారు. ఈ సందర్భంగా ప్రభాస్‌కు సీపీ సత్యనారాయణ సిబ్బందిని పరిచయం చేశారు. పలువురు పోలీసు అధికారులు ప్రభాస్‌తో ఫొటోలు దిగారు. ప్రభాస్‌ సీపీ కార్యాలయానికి రావడంతో ఆయనను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు అక్కడి తరలివచ్చారు.

  అనంతరం ప్రభాస్ అక్కడి నుంచి షూటింగ్ స్పాట్‌కు బయలుదేరారు. షూటింగ్ నిమిత్తం గోదావరిఖని ప్రాంతానికి చేరుకున్న ప్రభాస్‌కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. భారీ కాన్వాయ్‌తో ప్రభాస్ షూటింగ్ స్పాట్‌కు వెళ్లారు.  ప్రభాస్ గోదావరిఖని ప్రాంతానికి విచ్చేయడంతో ఆయన అభిమానులు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Peddapalli, Prabhas, Prabhas 21, Prashanth Neel, Ramagundam

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు