Poultry Industry: వర్షాలకు చనిపోతున్న కోళ్లు.. కుదేలవుతున్న పౌల్ట్రీ రంగం

Poultry Industry: భారీగా కురుస్తున్న వర్షాలకు ఫామ్ లలోకి నీరు చేరి కోళ్లు చనిపోతున్నాయి. దీంతో పౌల్ట్రీ ఫామ్ ల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

news18-telugu
Updated: September 26, 2020, 12:50 PM IST
Poultry Industry: వర్షాలకు చనిపోతున్న కోళ్లు.. కుదేలవుతున్న పౌల్ట్రీ రంగం
వర్షాలకు చనిపోతున్న కోళ్లు
  • Share this:
భారీగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. అనేక చోట్ల రోడ్లపై చెట్లు కూలిపోతున్నాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతోంది. పాత గృహాలు కూలిపోవడంతో బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అనేక చోట్ల పంటలు నేలమట్టమవడంతో ఏం చేయాలో అర్థం కాక రైతులు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే భారీ వర్షాలు పౌల్ట్రీ రైతులకు పెను నష్టం కలిగిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక చోట్లు ఫామ్ లలోకి నీరు చేరుతోంది. దీంతో కోళ్లు చనిపోతుండడంతో పౌల్ట్రీ యజమానులకు తీవ్రంగా నష్టం వాటిళ్లుతోంది.

తాజాగా రంగారెడ్డి జిల్లాలో నందిగామలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. యజమానికి తీవ్రం నష్టం మిగిల్చింది. వర్షాలకు రైతు యాదిరెడ్డికి చెందిన ఫామ్ లో దాదాపు 9500 కోళ్లు మృత్యువాత పడ్డాయి. వీటి విలువ దాదాపు రూ. 6 లక్షల వరకు ఉంటుందని అంచనా. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున నీళ్లు పౌల్ట్రీ ఫారంలోకి వచ్చాయని బాధిత రైతు తెలిపారు. దీంతో తక్కువ సమయంలోనే ఎక్కువ కోళ్లు మృత్యువాత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.

కరోనా మొదలైన కొత్తలో ఆ ప్రభావం పౌల్ట్రీ రంగంపై పడింది. చికెన్ తో కరోనా వస్తుందన్న ప్రచారంతో ఆ సమయంలో అనేక మంది తినడం మానేశారు. దీంతో అమ్మకాలు భారీగా పడిపోవడంతో పౌల్ట్రీ రంగం తీవ్రంగా దెబ్బతింది. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్లీ పౌల్ట్రీ పుంజుకుంది. చికెన్ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్న విషయం ప్రజల్లోకి వెళ్లడంతో అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా కోళ్లు చనిపోతున్నాయి. దీంతో వ్యాపారుల్లో మళ్లీ ఆందోళన వ్యక్తమవుతోంది. తమకు మళ్లీ తీవ్రంగా నష్టాలు వచ్చే ప్రమాదం ఉందన్న ఆవేదన వారిలో కనిపిస్తోంది.
Published by: Nikhil Kumar S
First published: September 26, 2020, 12:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading