POULTRY FARMERS CREATE RUCKUS IN POULTRY INDIA 2019 EXPO IN HYDERABAD SK
మంత్రి తలసాని సభలో గందరగోళం.. పౌల్ట్రీ రైతుల నిరసన..
మంత్రి తలసాని యాదవ్
పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కేవలం బడా వ్యాపారులకే ఇస్తున్నారని...పేద రైతులకు మాత్రం ప్రభుత్వ ఫలాలు అందడం లేదని నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఇండియా 2019 ఎక్స్పో ప్రారంభమైంది. మదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఇవాళ్టి నుంచి నవంబరు 29 వరకు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. తెలంగాణ పశుసంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఎక్స్పోను ప్రారంభించారు. ఐతే సభలో కొందరు పౌల్ట్రీ రైతులు గందరగోళం సృష్టించారు. పౌల్ట్రీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ కేవలం బడా వ్యాపారులకే ఇస్తున్నారని...పేద రైతులకు మాత్రం ప్రభుత్వ ఫలాలు అందడం లేదని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎగ్ బోర్డు ఏర్పాటు చేసి మనీస మద్దతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. పౌల్ట్రీ రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని నినాదాలు చేశారు.
అనంతరం మాట్లాడిన మంత్రి తలసాని.. పౌల్ట్రీ ఇండ్రస్ట్రీ అభివృద్ధి కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని అన్నారు. పౌల్ట్రీ రైతులకు విద్యుత్ సబ్సిడీ, గుడ్ల పంపిణీలో ప్రభుత్వం సహకారం అందిస్తోందని మంత్రి తెలిపారు. పౌల్ట్రీ ఇండ్రస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ మంత్రి వర్గంతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారని.. డిసెంబర్ 2న సబ్ కమిటీతో ఆయన సమావేశామవుతారని వెల్లడించారు. దేశంలో పౌల్ట్రీ రంగానికి మంచి భవిష్యత్ ఉందన్న తలసాని.. రాష్ట్రంలో పౌల్ట్రీ రంగాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.