POSTAL VOTES COUNTING STARTED IN HUZURABAD BY ELECTIONS VRY
Huzurabad Bypoll Results : ప్రారంభమైన పోస్టల్ ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో టీఆర్ఎస్
కౌంటింగ్ కేంద్రం లోపలి దృశ్యం
Huzurabad Bypoll Results : హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. కాగా మొత్తం 753 ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలను మొత్తం 22 రౌండ్లలలో లెక్కించనున్నారు.
Eహుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ( Huzurabad Bypoll Results ) ముందుగా పోస్టల్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. కాగా మొత్తం 753 ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలను మొత్తం 22 రౌండ్లలలో లెక్కించనున్నారు. కాగా పోస్టల్ ఓట్లలో టీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం పోలైన ఓట్లలో టీఆర్ఎస్, 344, బీజేపీ 159, కాంగ్రేస్ 32 ఓట్లు సాధించాయి.
రాష్ట్రవ్యాప్తం గా ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఉప ఎన్నిక ఫలితాల వెల్లడికి రంగం సిద్ధమైంది . మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పోలింగ్ జరగడంతో ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారన్న ఉత్కంఠ కేవలం కరీంనగర్ జిల్లాకే కాకుండా తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్ర మైన ఆంధ్రప్రదేశ్లోనూ ఎడతెగని ఆసక్తి నెలకొం ది .
తొలుత పోస్టల్ బ్యాలెట్లు .. ఉదయం 6 గంటలకు సిబ్బంది కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. మొత్తం 22 రౌండ్ల లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది . ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు.. పోస్టల్ ఓట్లు 753 పోలయ్యాయి. ఇక అనంతరం ఈవీఎంలలో ఓట్లను లెక్కించనున్నారు...కాగా మొత్తం 14 రౌండ్లు ఉంటాయి . ప్రతీ రౌండులోనూ 14 ఈవీఎంల్లోని ఓట్లను లెక్కించనున్నారు . ప్రతీ రౌండుకు కనీసం 30 నిమిషాల్లో పూర్తి కానుంది. .ఇక గతంలో లేని విధం గా రికార్డు స్థాయిలో ఓటింగ్ 86.64 శాతం ( 2,05,236 ఓట్లు ) నమోదవడంతో ఈ సమయం కనీసం 45 నిమిషాలు పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది . తొలిఫలితం హుజూరాబాద్ మండ లం పోతిరెడ్డిపేట్ పోలింగ్ స్టేషన్ తో మొదలవు తుంది . తుది ఫలితం కమలాపూర్ మండలం శం భునిపల్లితో ముగియనుంది . మధ్యలో వీణవంక , జమ్మికుంట , ఇల్లందకుంట మండలాల ఫలితాలు వస్తాయి .
ఇక కౌంటింగ్ జరిగే ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రాంగణం వద్ద మూడంచెల భద్రత కల్పించారు . కరీంనగర్ పట్టణంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన గొడవ లను దృష్టిలో ఉంచుకుని పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు . ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములకు కేంద్ర బలగాలు , సీసీ కెమెరాలతో పహారా కాస్తున్నారు . కాలేజీ పరిసరాల్లో జనసంచారం నిరోధానికి 144 సెక్షన్ విధించారు . ముం దు జాగ్రత్త చర్యగా కాలేజీ ముందున్న దాదాపు రెండు కిలోమీటర్ల రహదారిని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు .
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.