రేవంత్ గురించే మాట్లాడలేదు.. తప్పును సరిదిద్దుకుంటా: పోసాని

రేవంత్ రెడ్డి అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే.. తాను విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు పోసాని. ఇది తన తప్పుగా భావించి, సరిదిద్దుకుంటానని ప్రెస్ నోట్ విడుదల చేశారు.

news18-telugu
Updated: June 9, 2020, 4:13 PM IST
రేవంత్ గురించే మాట్లాడలేదు.. తప్పును సరిదిద్దుకుంటా: పోసాని
రేవంత్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి
  • Share this:
కాంగ్రెస్ నేత, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డిపై ఇటీవల సినీ నటుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆయన తీరుపై రేవంత్ అభిమానులు మండిపడ్డారు. పోసానిని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలో తాను చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి వివరణ ఇచ్చారు. తాను ఎప్పుడూ రేవంత్ రెడ్డిపై కామెంట్స్ చేయలేదని... మొన్న జరిగిన ప్రెస్ మీట్‌లో కూడా ఆయన గురించి మాట్లాడలేదని చెప్పారు. ఐనప్పటికీ రేవంత్ రెడ్డి అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే.. తాను విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు పోసాని. ఇది తన తప్పుగా భావించి, సరిదిద్దుకుంటానని ప్రెస్ నోట్ విడుదల చేశారు.


నాకు తెలిసి గానీ, తెలియక గానీ నా లైఫ్‌‌లో రేవంత్‌ రెడ్డిగారిని వ్వక్తిగతంగా గానీ, రాజకీయ పరంగా కానీ ఎప్పుడూ కామెంట్‌ చేయలేదు.ప్రతిపక్షం వారు విమర్శ చేసేటప్పుడు, సాక్ష్యం కూడా ఉంటే బాగుంటుందని మాత్రమే అన్నాను. రేవంత్‌ రెడ్డి గురించి నేను అసలు మాడ్లడలేదు. ఆయన అంటే నాకు ఎంతో గౌరవం. అయినా సోషల్‌ మీడియాలో యూట్యూబ్‌ ఛానల్స్‌లో బాగా ట్రోల్‌ అవుతున్నాయి కాబట్టి , ఇది నా బాధ్యతగా తీసుకొని రేవంత్‌ రెడ్డికి , ఆయన అభిమానులకు విచారం వ్యక్తం చేస్తున్నా. ఇది నా తప్పుగానే భావించి, ఈ తప్పును సరిదిద్దుకుంటాను.
పోసాని కృష్ణమురళి


జన్వాడలోని ఫాం హౌస్‌ను కేటీఆర్ అక్రమంగా జీవో 111 నిబంధనలను అతిక్రమించి నిర్మించారంటూ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఎన్జీటీ దర్యాప్తునకు ఆదేశించడంతో కేటీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై స్పందించిన పోసాని.. రేవంత్‌పై విమర్శలు గుప్పించారు. ‘ఎన్జీటీ దర్యాప్తునకు ఆదేశిస్తే... మంత్రి పదవికి రాజీనామా చేయమనడం ఏంటి? ఇది ఎక్కడి లాజిక్ నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి రూ.50లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి.. ఈరోజుల్లో ఇలా దొరికిన వ్యక్తి ఎవరూ లేరు. ఇలాంటి వ్యక్తి.. కేటీఆర్ ను రాజీనామా చేయమనడం ఏంటి? ఉన్న మంచి రాజకీయ నాయకుని పై బురదజల్లడం ఏంటి? కేటీఆర్, హరీష్ రావు నిజాయితీపరులైన రాజకీయనేతలు. వీళ్ళే భవిష్యత్ తెలంగాణ కు రెండు కళ్ళ లాంటి వారు.’ అని కృష్ణమురళి అన్నారు.

కేసీఆర్ నోట్లోంచి ఊడిపడ్డట్లే కేటీఆర్ ఉంటారని, ఎక్కడ ఎలా ఉండాలో కేటీఆర్ కు బాగా తెలుసని పోసాని చెప్పారు. కేటీఆర్ అవినీతి ని ప్రతిపక్ష నాయకులు నిరూపిస్తే రేపటి నుంచి టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరుగుతానని ప్రకటించారు. టీఆర్ఎస్ ను ఓడించాలని రాజకీయాలు చేస్తే.. ఎప్పటిరీ ప్రతి పక్షంలోనే ఉంటారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే, తెలంగాణలో మూడింట రెండు వంతుల భూమి సశ్యశ్యామలం అవుతుందని పోసాని చెప్పారు. ఇంత మంది ప్రాజెక్టు కడితే కమిషన్ కోసం కాళేశ్వరం కట్టారంటూ ఉత్తమ్, జానారెడ్డిలాంటి వారు విమర్శించడం తగదన్నారు పోసాని. ఐతే ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగడంతో.. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు.
Published by: Shiva Kumar Addula
First published: June 9, 2020, 4:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading