హోమ్ /వార్తలు /తెలంగాణ /

Mancherial: మంచిర్యాల జిల్లాలో తాళాలు పగులగొట్టి డబుల్ బెడ్రూం ఇళ్లు స్వాధీనం ..ఎందుకంటే

Mancherial: మంచిర్యాల జిల్లాలో తాళాలు పగులగొట్టి డబుల్ బెడ్రూం ఇళ్లు స్వాధీనం ..ఎందుకంటే

(అక్రమంగా స్వాధీనం)

(అక్రమంగా స్వాధీనం)

Mancherial: ప్రభుత్వం సొంత ఇల్లు ఇస్తుందని ఆశగా ఎదురుచూశారు. లబ్ధిదారుల జాబితాలో పేర్లు రాలేదు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపు జాప్యం కావడంతో నిరాశ చెందారు. ఇంకా ఆలస్యం చేస్తే ఎక్కడ తమకు ఇళ్లు ఇవ్వరో అనే అనుమానంతో నిర్మాణం పూర్తి చేసి తాళాలు వేసిన డబుల్ బెడ్రూం ఇళ్లను స్వాధీనం చేసుకున్న ఘటన మంచిర్యాల జిల్లా ప్రజలు.

ఇంకా చదవండి ...

(K.Lenin,News18,Adilabad)

పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణం, కేటాయింపుల్లో జరుగుతున్న జాప్యంతో లబ్దిదారుల్లో అసహనం పెరిగిపోతోంది. డబుల్ బెడ్ బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు కూడా చేపడుతున్నారు. అయితే మంచిర్యాల(Mancherial)జిల్లా రాజీవ్‌నగర్‌(Rajivnagar)లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం(Double bedroom)ఇళ్ల కేటాయింపులో జాప్యం జరుగుతుండటంతో పలువురు పేద ప్రజలు ఇళ్ల తాళాలను పగుల గొట్టి స్వాధీనం చేసుకున్నారు.

ఇంకా వేచి చూడలేక..

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మూడు వేల ఇళ్లు మంజూరు కాగా, మంచిర్యాల జిల్లా కేంద్రంలో 600 ఇళ్ల నిర్మాణం పూర్తైంది. కేవలం 30 మంది లబ్దిదారులకు మాత్రమే ఇల్లు కేటాయించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్ల కేటాయింపులో జరుగుతున్న ఆలస్యంతో దరఖాస్తు చేసుకున్న పేదలు 40 మంది పూర్తైన డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలు పగలగొట్టి స్వాధీనం చేసుకున్నారు. కాగా డబ్బులు ఇచ్చిన వాళ్లకే డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నారనే ప్రచారం జరగడంతో ఎక్కడ తమకు కేటాయింపులో అన్యాయం జరుగుతుందోనని భావించిన స్థానికుల్లో సుమారు 40 కుటుంబాలు ఇళ్లను స్వాధీనం చేసుకొని తాత్కాలికంగా గృహప్రవేశాలు కూడా చేశాయి.

అన్యాయం జరుగుతుందనే అనుమానంతో..

బుధవారం రాజీవ్‌నగర్‌లోని డబుల్‌ బెడ్రూం ఇళ్లలో 40కుటుంబాలు ప్లాట్లను స్వాధీనం చేసుకోగా...అంతకు ముందే మరికొందరు నూతన ఇళ్ల సముదాయంలో ఇళ్లను స్వాధీనం చేసుకొని అందులోనే నివసిస్తున్నారు. వంటా వార్పు కూడా అక్కడే చేసుకుంటున్నారు. అక్రమంగా ఫ్లాట్లలోకి వెళ్లిన వారిని అడ్డుకునేందుకు , కాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించడంతో బుధవారం సాయంత్రం కొంత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కాళీ చేసేది లేదని ..తెగేసి చెప్పారు మహిళలు.

ఇది చదవండి: నిజామాబాద్ జిల్లాలో ఆ గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు కొట్టుకుంటారు .. ఎందుకంటే


అక్రమంగా ఇళ్లు స్వాధీనం..

దినసరి కూలీలు, కాయ, కష్టం చేసుకొని బ్రతికే తాము ఇల్లు కట్టుకునే ఆర్ధిక స్తోమత లేక అద్దె ఇళ్లలో కిరాయి కట్టుకోలేక చితికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడితే పూట గడవడం కష్టంగా ఉందని, అలాంటిది ఇంటి కిరాయి కట్టడం ఇబ్బంది అవుతుందని డబుల్ బెడ్రూం ఇళ్లు స్వాదీనం చేసుకున్న వాళ్లు తెలిపారు. ప్రస్తుతం తాము స్వాధీనం చేసుకున్న ఇళ్లకు సంబంధించిన కేటాయింపు పత్రాలు కూడా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిర్మాణం పూర్తై..కేటాయింపు జరగని డబుల్ బెడ్రూం ఇళ్లను స్థానికులు స్వాధీనం చేసుకున్న ఘటనపై స్పందించిన రెవెన్యూ అధికారులు విచారణ చేపట్టారు.

ఇది చదవండి: గ్రామస్తులు తీర్చిదిద్దిన ప్రభుత్వ పాఠశాల.. ప్రైవేటు పాఠశాలకు ధీటుగా సౌకర్యాలు.. ఎక్కడంటే?ప్రతి చోట ఇదే తంతు..

ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల ఈ ఇళ్ల నిర్మాణం పూర్తైన తర్వాత కూడా లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో అసాంఘీక కార్యక్రమాలకు నెలవుగా మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల నిర్మాణం పూర్తై..ఎవరికి కేటాయించక ముందే డబుల్ బెడ్రూం ఇళ్లు పగుళ్లు తేలాయి. డబుల్ బెడ్రూం ఇళ్లను పారదర్శకంగా పేదలకే కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం మాట అమలు కావడం లేదని ఇళ్ల కేటాయింపులో అవినీతి జరుగుతోందనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తోంది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల విషయంలో విమర్శలు, ఆరోపణలకు తావు లేకుండా అర్హులు, పేదలకు కేటాయిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదనే సంకేతాలు వస్తున్నాయి.

ఇది చదవండి: స్కూళ్లలో మంచినీళ్లు దొరకడం లేదు కానీ, తెలంగాణలో మద్యం దొరుకుతోంది.. సీఎం కేసీఆర్​పై షర్మిలా ఫైర్​


First published:

Tags: Double bedroom houses, Mancherial

ఉత్తమ కథలు