Home /News /telangana /

POOR GIRL IN MEDAK DISTRICT SEEKING HELP FOR HER PARENTS MEDICAL EXPENSES SNR MDK

Telangana | Poor Girl : రోజు కాలేజీకి వెళ్లాల్సిన అమ్మాయి కూలీ పనికి వెళ్తోంది .. ఎందుకంటే

(POOR GIRL)

(POOR GIRL)

Telangana | Poor Girl : బాగా చదువుకొని ప్రయోజకురాలు కావాలనుకున్న ఓ పేదింటి అమ్మాయిని చిన్నతనం నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. కన్నవాళ్లను పోషించడానికి బ్రతుకు బండిని లాగుతూ అలసిపోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Medak, India
  (K.Veeranna,News18,Medak)
  కొందరి జీవితాల్ని చూస్తుంటే కష్టాలు, కన్నీళ్లు పేదవాళ్ల ఆస్తులు అనిపిస్తుంది. ఓవైపు కటిక పేదరికం, మరోవైపు వెంటాడుతున్నదరిద్రం. ఈ రెండు తోడైతే ఎంత గుండె ధైర్యం కలిగిన వ్యక్తులైనా కుదేలు అవ్వాల్సిందే. బాగా చదువుకొని ప్రయోజకురాలిని కావాలనుకున్న ఓ పేదింటి అమ్మాయిని చిన్నతనం నుంచే కష్టాలు వెంటాడుతున్నాయి. కన్నవాళ్లను పోషించడానికి బ్రతుకు బండిని లాగుతూ అలసిపోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. మెదక్ (Medak)జిల్లాకు చెందిన ఓ 16ఏళ్ల బాలిక(16Year old girl)దీనగాధ మనసున్న ప్రతి మనిషిని కదిలిస్తోంది.

  Double Murders : పెళ్లి చేయమని అడుగుతుంటే పట్టించుకోలేదనే కోపంతో తండ్రి, బాబాయ్‌ని కొడుకు ఏం చేశాడో తెలుసా..?  చిన్నతనంలోనే కష్టాలు..
  మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన భార్గవి జీవితం బతుకు జట్కాబండిగా మారింది. భార్గవి తల్లిదండ్రులు మంగళి విఠల్, పద్మ నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్లు. ఎలాంటి ఆస్తులు, సాగు చేసుకోవడానికి భూమి కూడా లేదు. రోజూ కూలీ పనికి వెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఇలాంటి కటిక పేద కుటుంబంలో పుట్టిన భార్గవి ఏడవ తరగతి చదువుతున్న సమయంలో తండ్రి విఠల్ 2014లో పక్షవాతం కారణంగా మంచానపడ్డాడు. తల్లి పద్మ కూలీ చేసుకొచ్చి భర్త, కూతుర్ని పోషిస్తూ వచ్చింది. కూలీ డబ్బులతో బిడ్డ, భర్తను పోషించడం తప్ప మంచి వైద్యం చేయించే స్తోమత, పిల్లను ప్రైవేట్ స్కూల్‌ చెప్పించలేని దుస్థితిని భార్గవి కళ్లారా చూస్తూ పెరిగింది.  చదువుకోవాల్సిన వయసులో కూలీ పని..
  తండ్రి పక్షవాతంతో మంచాన పడిన ఐదేళ్లకు తల్లి పద్మ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ అని తెలియడంతో నిజామాబాద్‌ జిల్లాలోని ఇందూరు క్యాన్సర్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుండి తల్లి కూడా కష్టమైన పనులు చేయడానికి ఇబ్బంది పడుతూ ఉండటంతూ ఉండటంతో భార్గవి ఇంట్లో మంచాన పడి ఉన్న తండ్రికి సపర్యలు చేయడంతో పాటు అటు క్యాన్సర్ బారిన పడిన తల్లికి చికిత్స కోసం ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి రావడంతో చదువుకు దూరమైంది. ఆరోగ్యం మరింత క్షీణించి 2020 సెప్టెంబరులో విఠల్ మృతి చెందాడు. ఇక భార్గవి తల్లిని ప్రతి మూడు నెలలకోసారి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చేది. చికిత్స ఉచితమే అయినా మందులు, పరీక్షలు, రవాణా ఖర్చులు భరించలేని పరిస్థితి తలెత్తింది.

  Telangana : మునుగోడులో మునుగుడో..? తేలుడో ..? మళ్లీ ఆ మంత్రిపైనే భారమంతా  తల్లిదండ్రుల్ని పోషిస్తున్న బాలిక..
  గ్రామంలోని పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో భార్గవి 2022 మేలో పదో తరగతి పరీక్షలు రాయగా. 5.5 జీపీఏతో పాసైంది. పదవ తరగతి పాసైన తాను కాలేజీకి వెళ్లాలని ఉన్నత చదువులు అభ్యసించాలని ఆశపడింది. కాని పేదరికం, తల్లిదండ్రుల అనారోగ్య పరిస్థితులు చూసి తన ఆశయాన్ని చంపుకుంది. కనీసం గవర్నమెంట్ కాలేజీలో చేరినా పుస్తకాలు, బస్‌ పాస్, వంటి చేతి ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో భార్గవి చదువుకు స్వస్తి చెప్పి కూలీ పనులకు వెళ్తోంది. ప్రస్తుతం మూడు నెలలుగా తమ దగ్గర డబ్బులు లేకపోవడంతో చేతిలో తల్లి పద్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయింది. తాను పడుతున్న బాధలు చూసి ఎవరైనా పెద్ద మనసు చేసుకొని ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటోంది భార్గవి. తల్లి,తండ్రుల ఆరోగ్యం కోసం కూతురు పడుతున్న కష్టాలు మరెవరికి రాకూడదని గ్రామస్తులు అంటున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: Medak, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు