Home /News /telangana /

POLLUTION LESS ELECTRIC BUSES FOR HYDERABAD TO CUT TONNES OF CO2 EMISSIONS NK

హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్ బస్సులు... కాలుష్యం తగ్గుతుందా?

ఎలక్ట్రిక్ బస్సులు (File)

ఎలక్ట్రిక్ బస్సులు (File)

Electric Buses : హైదరాబాద్‌లో తొలిసారి 4 రూట్లలో 40 బస్సుల్ని నడుపుతున్నారు. ఏసీ బస్సు ఛార్జీలే వీటికీ వసూలు చేస్తారు.

వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా... హైదరాబాద్‌లో మంగళవారం ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రారంభిస్తున్నారు. ముందుగా 40 ఎలక్ట్రిక్‌ బస్సుల్ని టీఎస్‌ ఆర్టీసీ రోడ్లపై పరుగులు పెట్టించబోతోంది. ఇప్పటికే ట్రయల్‌రన్స్‌ విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ బస్సులు... మంగళవారం సాయంత్రం మియాపూర్‌-2 డిపో నుంచి బయలుదేరతాయి. టీఎస్‌ ఆర్టీసీ ఎండీతోపాటు బస్సుల్ని తయారుచేసిన ప్రైవేటు సంస్థ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మియాపూర్‌-2, కంటోన్మెంట్‌ డిపోల నుంచి 20 బస్సుల చొప్పున శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్ రూట్లలో వీటిని నడపనున్నారు. ఎయిర్ పోర్టులో గ్రేటర్‌ ఆర్టీసీ ఈ బస్సులను ఆపరేట్‌ చేయబోతోంది. ఏసీ బస్సు ఛార్జీలనే ఎలక్ర్టికల్‌ బస్సుల్లోనూ వసూలు చేస్తామని అధికారులు తెలిపారు.

ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండ్‌ను బట్టీ ఫ్యూచర్‌లో మిగతా రూట్లలోనూ ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపే అవకాశాల్ని పరిశీలిస్తామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. మియాపూర్‌-2, కంటోన్మెంట్‌ డిపోలలో ఎలక్ర్టికల్‌ బస్సుల కోసం ప్రత్యేకంగా ఛార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ఛార్జింగ్‌ స్టేషన్‌లో 10-12 బస్సులకు ఒకేసారి ఛార్జింగ్‌ పెట్టే వీలుంటుంది. ఒక్కో బస్సునూ 4 గంటలు ఛార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్లు వెళ్తుందని అధికారులు తెలిపారు.

అంతాబాగానే ఉన్నా ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జీలు అత్యధికంగా నిర్ణయించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాలుష్యం తగ్గించే పేరుతో అడ్డగోలు బాదుడేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందరూ ప్రయాణించేలా బస్సుల్ని అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.

 

ఇవి కూడా చదవండి :

గుజరాత్‌కు ప్రధాని మోదీ వరాల జల్లు... కీలక ప్రాజెక్టుల ప్రారంభం

ఆ వీడియోలు వెంటనే తొలగించండి... ఫేస్‌బుక్, గూగుల్‌కు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

వామ్మో... ఇలాంటి వెబ్ సైట్లు కూడా ఉంటాయా? చిత్రం... విచిత్రం

యూట్యూబ్‌ లో సైన్ ఇన్ అవ్వకుండా ఆ వీడియోలు చూడటం ఎలా... ఇలా చెయ్యండి
First published:

Tags: Hyderabad, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు