POLLUTION IN HYDERABAD DUE TO RECENT WEATHER CONDITIONS VRY BK
Hyderabad : గుండె పదిలం... హైదరాబాద్‌లో డెంజర్ బెల్స్ ! భారీగా పెరిగిన ఎయిర్ పొల్యూషన్
pollution in hyderabad
Hyderabad : ఇటివల రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నగర ప్రజలను మరో ప్రమాదానికి గురి చేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతవరణ కాలుష్యం కూడా పెరుగుతోంది.
ఇప్పటికే హైదరాబాద్ లో ఉష్ట్రోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా సింగిల్ డిజిట్ ఉష్ట్రోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి గాలులు ఉంటున్నాయి. ఇదిలా ఉంటే ఉష్ణోగ్రతలు పడిపోవడంతో నగరం మరోసారి డేంజర్ బెల్స్ ను మోగిస్తోంది. భారీగా పడిపోతున్న ఉష్టోగ్రతల కారణంగా ఎయిర్ పొల్యూషన్ స్థాయి గతం కంటే చాలా పెరిగిందని వాతావరణ శాఖ నివేధికలు చెబుతున్నాయి. సిటీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ బాగా క్షీణించింది. గురువారం బోల్లారం, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 101-200 ఉంది, అయితే ఈ పరిస్థితి ఊపిరితిత్తులు, గుండె రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించేంతగా గాలిలో కాలుష్యం దట్టంగా ఉందని ఇది ప్రమాదకర స్థాయి అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. మరో వైపు ఎన్నడు లేని విధంగా సిటీలో సనత్‌నగర్ వద్ద 261 పాయింట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ నమోదైంది.
తగ్గుతున్న ఉష్టోగ్రతల కారణంగానే గాలీలో కాలుష్య స్థాయిలు పెరిగిపోయాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. చల్లటి గాలి ఉపరితలం పైన వెచ్చని గాలి పొర పై కూర్చొని, కాలుష్యం, అలెర్జీ కారకాల రసాయనాలను ఉత్పత్తి చేయడం వలన గాలిలో కాలుష్యం స్థాయి ఈ సీజన్ లో పెరుగుతుందని చెబుతున్నారు .అయితే గతంలో ఎన్నడు లేని విధంగా ఈ స్థాయిలో ఇప్పుడు సిటీలో పెరగడం ఇప్పుడు కలవరపెట్టే అంశంగా మారింది.
“గాలి కాలుష్యం వాతావరణంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. శీతాకాలంలో, చల్లని గాలి దట్టంగా ఉంటుంది వెచ్చని గాలి కంటే నెమ్మదిగా కదులుతుంది దీంతో చల్లటి గాలి కాలుష్యా స్థాయిని పెంచుతుందని తెలిపారు హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ కె నాగరత్న
ప్రతి సంవత్సరం, హైదరాబాద్‌లో, చలికాలం వచ్చేసరికి AQI స్థాయిలు పెరగడం సహాజంగానే జరుగుతాయి అయితే ఆ స్థాయిలు ఇప్పుడు గణనీయంగా పెరగడం ఆలోచించాల్సిన విషయం అంటున్నారు. ప్రతీ ఏడాది అక్టోబర్ నుండి మార్చి వరకు గాలిలో కాలుష్యం స్థాయి సాధారణంగా తక్కువగా ఉంటుంది. కానీ శీతాకాలంలో మాత్రం ఆ స్థాయిలు అన్ని ప్రాంతాల్లో పెరుగుతాయి అన్నారు నాగరత్నం.
శీతాకాలంలో గాలిలో తేలియాడే టాక్సిక్స్ అనేక రకాల కాలుష్య కారకాలతో కూడి ఉంటాయి, వీటిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్, PM10, ఓజోన్, PM2.5 ప్రదానమైనవి అయితే ఇవే ఈ సమయంలో గాలీలో కాలుష్యం స్థాయి పెంచడానికి కారణాలుగా పని చేస్తాయి. ఈ రసాయనాలు సాదారణంగా ఉబ్బసం లేదా ఇతర ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు రావడానికి కారణమవుతాయి అంటున్నారు వైద్యనిపుణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.