Home /News /telangana /

Polling Day : హుజూర్‌నగర్‌లో 15 శాతం పోలింగ్... జోరుగా వస్తున్న ఓటర్లు

Polling Day : హుజూర్‌నగర్‌లో 15 శాతం పోలింగ్... జోరుగా వస్తున్న ఓటర్లు

ఓటు వేసేందుకు తరలివచ్చిన మహిళలు

ఓటు వేసేందుకు తరలివచ్చిన మహిళలు

Polling Day : హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంతోపాటూ... మహారాష్ట్ర, హర్యానాల్లో పోలింగ్ ప్రారంభమైంది.

  తెలంగాణలోని... హుజూర్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 10 గంటల సమయానికి దాదాపు 15 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచే ఇక్కడ ఓటర్లు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇందుకు అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. పోలీసు ఉన్నతాధికారులు, ఎన్నికల సంఘం ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా అభ్యర్థులపై గట్టి నిఘా ఉంచాయి. నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో వాహన తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థుల కదలికలపై నిఘా పెంచారు. లైసెన్స్డ్‌ వెపన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందువల్ల పోలింగ్‌ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగుతోంది. ఎక్కడికక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ప్రజలు బారులు తీరారు.

  హుజూర్‌నగర్ స్థానంలో మొత్తం 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, టీఆర్ఎస్ తరఫున సైదిరెడ్డి, బీజేపీ నుంచి రామారావు, టీడీపీ తరఫున చావా కిరణ్మయి పోటీలో ఉన్నారు. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోరుసాగుతుందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. పోలింగ్ జరుగుతున్న తీరును బట్టీ... ప్రజలు ఎవరికి అనుకూలంగా ఓటు వేస్తున్నదీ ఇప్పుడే చెప్పేలమంటున్నారు.

  మరోవైపు మహారాష్ట్ర, హర్యానాలో జోరుగా పోలింగ్ సాగుతోంది. మహారాష్ట్రలో అక్కడక్కడా వాన కురుస్తున్నా... పోలింగ్‌కి ఎలాంటి ఆటంకమూ కలగట్లేదని అధికారులు తెలిపారు.

   

  Pics : కన్నడ ముద్దుగుమ్మ మేఘశ్రీ క్యూట్ ఫొటోస్
  ఇవి కూడా చదవండి :

  తెలంగాణలో జగన్‌కి పెరుగుతున్న క్రేజ్... ఇవీ కారణాలు

  ఖమ్మం జిల్లాలో బస్సు బోల్తా... ఒకరు మృతి... ఏడుగురికి గాయాలు

  ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం... ఓ చిన్నారి మృతి

  Health Tips : మిల్క్ చాకొలెట్స్ తింటే... ఎన్నో ప్రయోజనాలు

  Health Tips : కోడిగుడ్డు, పొట్లకాయ... కలిపి తింటున్నారా... జాగ్రత్త
  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Huzurnagar bypoll 2019, Telangana News, Telugu news, Telugu varthalu

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు