హోమ్ /వార్తలు /telangana /

CM KCR : రాజకీయాలు మాకు టాస్క్ .. నాట్ ఏ గేమ్.. కొనసాగుతున్న ప్రసంగం.. ఉద్యోగ ప్రకటన చేసిన సీఎం.

CM KCR : రాజకీయాలు మాకు టాస్క్ .. నాట్ ఏ గేమ్.. కొనసాగుతున్న ప్రసంగం.. ఉద్యోగ ప్రకటన చేసిన సీఎం.

CM KCR : తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ప్రకటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి 
పరిపాలన అంటే ఒక టాస్క్ అని అన్నారు..కాని గేమ్స్ కాదని అన్నారు. 91142 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్

CM KCR : తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ప్రకటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి పరిపాలన అంటే ఒక టాస్క్ అని అన్నారు..కాని గేమ్స్ కాదని అన్నారు. 91142 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్

CM KCR : తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ప్రకటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీకి పరిపాలన అంటే ఒక టాస్క్ అని అన్నారు..కాని గేమ్స్ కాదని అన్నారు. 91142 ఉద్యోగాలకు నోటిఫికేషన్స్

ఇంకా చదవండి ...

    డో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రసంగిస్తు‍న్నారు. కాసేపట్లో అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేయనున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కోసం విద్యార్థులు ఉద్యమం చేశారని తెలిపారు. ఉద్యమ సమయంలో తాను పోలీసు లాఠీ దెబ్బలు తిన్నానని చెప్పారు. అడ్డదిడ్డం మాట్లాడే పార్టీ మాది కాదు. ప్రజలకు ఎవరు ఎంటో తెలుసు అన్నారు. సీఎం కేసీఆర్.తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు విద్యార్థులు చేశారు. బాధ్యతగా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌పై ఒక బాధ్యతను పెట్టారు కాబట్టి ఆ భాద్యతలు నెరవేర్చేందుకు ముందుకు సాగుతున్నామని అన్నారు.

    తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు

    తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు అని చెప్పారు. దీంతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటున్నామని అన్నారు.. ఈ క్రమంలోనే గతంలో తెలంగాణ ఉద్యమంతోపాటు ఉద్యోగుల సమస్యలకు సంబంధించి సీఎం ప్రస్తావించారు.శాశ్వత ప్రాతిపదికన తెలంగాణ ప్రజలకే ఉద్యోగులు దక్కేటట్టు తీసుకువచ్చిన ఘనత మాదే అని చెప్పారు. దీంతో అటెండర్ స్థాయి నుండి అన్ని పోస్టులు 90 స్థానికులకే దక్కనున్నాయని ఆయన చెప్పారు. ఇదివరకు నాన్‌లోకల్ పోస్టుల పేరుతో ఆంధ్రవారికి ఉద్యోగాలు కట్టబెట్టారని అన్నారు. అయితే రాష్ట్ర సెక్రటేరియట్ లో మాత్రం ఐదు శాతం ఓపెన్ పోస్టులు పెట్టామని చెప్పారు. ఆంధ్ర వారు పెట్టిన పంచాయితీ ఇటివలే తెగాయని అన్నారు. పూర్తి స్థాయి అవగాహాన కూడా ఇటివలే వచ్చాయని అన్నారు. అందుకే 317 జీవో విడుదల చేశామని చెప్పారు. కాని దీనిపై తలతోక తెలియని కొన్ని పార్టీలు అనవసర ఆందోళన చేపట్టాయని విమర్శించారు. కాని ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేయకుండా పూర్తి చేశామని చెప్పారు. ఉద్యోగాల సంక్షేమంపై తీసుకున్న అనేక చర్యలను ఆయన సభకు వివరించారు.

    First published: